విజయ్ ఎమోషనల్
- IndiaGlitz, [Wednesday,April 10 2019]
విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా ఓ సినిమాకు సంతకం చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఎమోషనల్‌గా సాగుతుందట. 'మజిలీ'కి దర్శకత్వం వహించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని వినికిడి. 'నిన్ను కోరి', 'మజిలీ' రెండూ వివాహానంతరం ప్రేమ, వివాహానికి ముందున్న కాన్ఫ్లిక్ట్స్ ఆధారంగా రూపొందిన కథలు తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించబోయే చిత్రం కూడా ఇదే కోవలో ఉంటుందని టాక్.
మరోవైపు తన దగ్గర అన్ని జోనర్ల కథలూ ఉన్నాయనీ, ఒక్క జోనర్‌కే పరిమితం కాదలచుకోలేదనీ శివ నిర్వాణ ఇప్పటికే చెబుతున్నారు. ఒకవేళ దాన్ని ఫాలో అయితే జోనర్లో మార్పులూ, చేర్పులూ కూడా ఉండొచ్చు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రష్మిక హీరోయిన్గా నటిస్తోన్న 'డియర్ కామ్రేడ్'లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో 'గీతగోవిందం' బ్లాక్ బస్టర్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. విజయ్ దేవర కొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ సరసన ఓ సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత తమిళ దర్శకుడు ఆనంద్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో చేస్తారు. ఆ తర్వాతే శివ నిర్వాణ సినిమా ఉంటుందని టాక్.