నాని జ‌త‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్‌

  • IndiaGlitz, [Thursday,December 06 2018]

వ‌రుస విజ‌యాల‌తో త‌న‌కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువ క‌థానాయ‌కుడు నాని.. 24వ సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఫిబ్ర‌వ‌రి 19 నుండి సినిమా ప్రారంభం కానుంది.

ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్‌గా రీతూవ‌ర్మ పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై అధికారిక స‌మాచారం రానుంది. అంతా అనుకున్న‌ట్లు కుదిరితే 'కేశ‌వ' సినిమా త‌ర్వాత రీతూ వ‌ర్మ తెలుగులో చేయ‌బోయే సినిమా ఇదే అవుతుంది.