ఫైటర్ స్టార్ట్... బాలీవుడ్ హీరోయిన్‌తో రొమాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఈయన హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `ఫైటర్` సినిమా స్టార్ అవుతుందని వార్తలు వినపడ్డ సంగతి తెలిసిందే. సోమవారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తెలుగుతో పాటు ఈ సినిమాను హిందీలో తెరకెక్కిస్తున్నారు. పూరి దర్శకత్వంతో పాటు ఛార్మితో.. బాలీవుడ్ మూవీ మేకర్ కరణ్‌జోహార్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి ఛార్మి క్లాప్ కొట్టారు.
ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ నటిస్తుందని వార్తలు వినపడ్డాయి. కానీ ఆమె డేట్స్ కుదరకపోవడంతో ఆమె నటించడం లేదట. ఇప్పుడు ఆమె స్థానంలో మరో బాలీవుడ్ హీరోయిన్ అనన్యపాండే నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. కరణ్‌జోహార్ రూపొందించిన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2` సినిమాలో నటించింది. కరణ్‌జోహార్ ముందు జాన్వీని నటింప చేయాలనుకున్నాడు. కానీ ఆమెకు కుదరకపోవడంతో ఆమె స్థానంలో అనన్యపాండేను నటింప చేస్తున్నాడు. అంతా అనుకున్నట్లే జరిగితే అనన్య టాలీవుడ్ డెబ్యూ ఇదే అవుతుంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ పెంచుతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com