ఫైట‌ర్ స్టార్ట్‌... బాలీవుడ్ హీరోయిన్‌తో రొమాన్స్‌

  • IndiaGlitz, [Monday,January 20 2020]

యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఫైట‌ర్‌' సినిమా స్టార్ అవుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. సోమ‌వారం ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. తెలుగుతో పాటు ఈ సినిమాను హిందీలో తెర‌కెక్కిస్తున్నారు. పూరి ద‌ర్శ‌క‌త్వంతో పాటు ఛార్మితో.. బాలీవుడ్ మూవీ మేక‌ర్ క‌ర‌ణ్‌జోహార్‌తో క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తుండ‌టం  విశేషం. ఈ సినిమా ప్రారంభోత్స‌వంలో ముహూర్తపు స‌న్నివేశానికి ఛార్మి క్లాప్ కొట్టారు.

ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీక‌పూర్ న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. కానీ ఆమె డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డంతో ఆమె న‌టించ‌డం లేద‌ట‌. ఇప్పుడు ఆమె స్థానంలో మ‌రో బాలీవుడ్ హీరోయిన్ అన‌న్య‌పాండే న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. క‌ర‌ణ్‌జోహార్ రూపొందించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్‌2' సినిమాలో న‌టించింది. క‌ర‌ణ్‌జోహార్ ముందు జాన్వీని న‌టింప చేయాల‌నుకున్నాడు. కానీ ఆమెకు కుద‌ర‌క‌పోవ‌డంతో ఆమె స్థానంలో అన‌న్య‌పాండేను నటింప చేస్తున్నాడు. అంతా అనుకున్న‌ట్లే జ‌రిగితే అనన్య టాలీవుడ్ డెబ్యూ ఇదే అవుతుంది. ఈ సినిమా కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ సిక్స్ ప్యాక్ పెంచుతున్నాడు.