బాలీవుడ్ విలన్‌తో విజ‌య్‌దేవ‌ర‌కొండ ఢీ

  • IndiaGlitz, [Tuesday,July 14 2020]

టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒక‌రైన విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ త‌న మార్కు హీరోయిజంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఎలివేట్ చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే ముంబైలో కొంత మేర చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు ఆగింది. ఇప్పుడు పూరీ అండ్ టీమ్ మిగిలిన షూటింగ్‌ను హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి.

ఈ నేప‌థ్యంలో లేటెస్ట్ సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టిని విల‌న్‌గా న‌టింప చేయ‌డానికి పూరీ అండ్ గ్యాంగ్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తుంద‌ని టాక్‌. పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మి తెలుగులో ఈ సినిమాను నిర్మిస్తుంటే.. హిందీలో క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్ర నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండకు కాస్త న‌త్తి కూడా ఉంటుంద‌ని అంటున్నారు. ఈ చిత్రానికి ఫైట‌ర్‌, లైగ‌ర్ అనే రెండు టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు టాక్‌.