రౌడీల‌కు విజ‌య్‌దేవ‌ర‌కొండ లేఖ‌..

  • IndiaGlitz, [Wednesday,October 03 2018]

యూత్‌కు మంచి క్రేజ్ ఉన్న హీరోగా విజ‌య్‌దేవ‌ర‌కొండ ఇమేజ్ ఉంది. అందుకే త‌న‌ను రౌడీ అని.. త‌న అభిమానుల‌ను రౌడీస్ అని విజ‌య్ సంబోధిస్తుంటాడు. అక్టోబ‌ర్ 5న విజ‌య్ న‌టించిన 'నోటా' చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న అభిమానులంద‌రికీ ఓ లేఖ రాశాడు..

ప్రియ‌మైన రౌడీల్లారా!!

మ‌నం మార్పును కోరుకుంటున్నాం. అది సినిమా అయినా.. జీవిత‌మైనా, మ‌న రౌడీ క‌ల్చ‌ర్‌లో అయినా..మ‌న యాట్యిట్యూడ్‌లో అయినా కావ‌చ్చు. అయితే సోష‌ల్ మీడియాను పాజిటివ్‌గా ఉంచే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. చాలా మంది నా ఫోటోను వారి ఫోన్స్‌, కంప్యూటర్స్‌లో ఉంచుకునుంటారు. అయితే ఇత‌రుల మీరు మాట‌ల యుద్ధం చేయ‌డాన్ని నేను గ‌మ‌నించాను.

నేను అలాంటి ప‌ని చేయ‌ను కాబ‌ట్టి మీరు కూడా అలాంటి ప‌ని చేయ‌వ‌ద్దు. నేను ఇలా చెప్ప‌డం మీకు బాధ క‌లిగించ‌వ‌చ్చు. నేను నా కోసం.. నా జీవితం కోసం ప‌ని చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. స్వ‌శ‌క్తితోనే వాటిని సాధించాను. కాబ‌ట్టి ఇత‌రుల గురించి ఆలోచించను. జీవించు.. ఇత‌రుల‌ను జీవించ‌నివ్వు అనేదే నా పాల‌సీ. మ‌న‌ల్ని ఎవ‌రైనా ద్వేషించినా అంద‌రూ బావుండాల‌ని, సంతోషంగా ఉండాల‌ని కోరుకోండి.

మీకెలాంటి చింతా అవ‌స‌రం లేదు. నేను క‌చ్చితంగా మంచి సినిమాలే చేస్తాను. కాబ‌ట్టి ఇక‌పై అన్‌లైన్‌లో దూషించుకోర‌ని భావిస్తున్నాను.. ఫుల్ చిల్ అండ్ ల‌వ్‌

ల‌వ్ యు ఆల్ వేస్‌

రౌడీ!!