అభిమానులకు షాకిచ్చిన రౌడీ హీరో!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం ఇంట్లో తనను మగాడిలా చూడటం లేదని వాపోతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం టాలీవుడ్‌లో బీ ద రియల్ మేన్ అనే ఛాలెంజ్ మాంచి ట్రెండ్‌లో ఉంది. సందీప్ వంగా స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ రాజమౌళి నుండి విస్తరిస్తూ వస్తుంది. ఇన్ని రోజుల వరకు సినిమాలకే పరిమితమైన సెలబ్రిటీలు ఇంట్లోని మహిళలకు సాయం అందిస్తూ బీ ద రియల్ మేన్ అనిపించుకోవడమే ఈ ఛాలెంజ్ ముఖ్యోద్దేశం. ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్న కొరటాల శివ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ పేరును నామినేట్ చేశారు.
ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడంపై స్పందించిన విజయ్ దేవరకొండ తనను ఇంట్లో ఇంకా చిన్నపిల్లాడిలాగానే చూస్తున్నారని తెలిపారు. ‘‘శివ సార్.. మా అమ్మ నన్ను ఇంట్లో పనిచేయనీయడం లేదు. నన్ను రియల్ మేన్‌లా చూడటం లేదు. పిల్లాడిగానే ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి లాక్‌డౌన్‌లో నా లైఫ్ ఎలా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియో పోస్ట్ చేస్తాను’’ అని మెసేజ్ చేశాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్యపాండే హీరో్యిన్‌గా నటిస్తోంది.
Siva sir ??
— Vijay Deverakonda (@TheDeverakonda) April 23, 2020
Ma mummy nannu Pani cheyanitle..
Pani double avthundanta..
Intlo inka real men la chudatle mammalni.. pillallane treat chestunaru.. but will show you a glimpse of my day in lockdown.. ?? https://t.co/Gk0iULg8aW
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments