కరోనా గురించి భయపడొద్దు.. ఇలా నివారించండి!
- IndiaGlitz, [Tuesday,March 10 2020]
‘కరోనా వైరస్’ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడీ వైరస్ తెలుగు రాష్ట్రాలకు పాకడంతో ఎప్పుడేం జరుగుతుందో అని జనాలు భయంతో వణికిపోతున్నారు. తెలంగాణలో ఓ కేసు నమోదు కాగానే సామాన్య ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. మరోవైపు.. కరోనా అనుమానితులు ఎక్కువవుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు తమకు తోచిన సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే యాంకర్ సుమ, పలువురు సెలబ్రిటీలు వీడియో రూపంలో తగు జాగ్రత్తలు చెప్పగా.. తాజాగా.. యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓ వీడియోను వదిలాడు. కాగా ఈ వీడియోను తెలంగాణ ప్రభుత్వం విజయ్‌తో చేయించింది.
వీడియోలో ఏముంది..!?
కరోనా వైరస్ గురించి ప్రజలు భయపడాల్సిన పని లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు. కరోనా వైరస్‌ను అరికట్టాలంటే.. ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దు. నమస్కారం మాత్రమే చేయండి. తరచుగా చేతిని సబ్బుతో కడుక్కోవాలి. కళ్లు, ముక్కు, నోటిని, చెవిని చేతితో తాకవద్దు. ఎవరైనా దగ్గుతున్నా.. తుమ్ముతున్నా వారి నుంచి కనీసం 3 అడుగుల దూరంలో ఉండాలి. జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల నుంచి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఎవరికైనా ‘కరోనా’కు సంబంధించిన లక్షణాలు ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే ‘104’ కు ఫోన్ చేయాలి’ అని విజయ్ ఆ వీడియోలో నిశితంగా వివరించాడు.
కొరోనావైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు...
— IndiaGlitz™ l Telugu (@igtelugu) March 10, 2020
పద్ధతిగా నమస్కారం పెట్టండి...
షేక్ హ్యాండ్ ఇవోద్దు....#VijayDeverakonda #Coronavirus
#coronavirus #COVID2019#coronavirusindia #CoronaVirusUpdate #Coronavid19 pic.twitter.com/dlP5FQ1U7B