రౌడీ హీరో క్వారంటైన్ టైమ్ వీడియో

ప్రస్తుతం టాలీవుడ్‌లో బీ ద రియ‌ల్ మేన్ అనే ఛాలెంజ్ ట్రెండ్‌లో ఉంది. సందీప్ వంగా స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ రాజ‌మౌళి నుండి విస్త‌రిస్తూ వ‌స్తుంది. ఇన్ని రోజుల వ‌ర‌కు సినిమాల‌కే ప‌రిమిత‌మైన సెల‌బ్రిటీలు ఇంట్లోని మ‌హిళ‌ల‌కు సాయం అందిస్తూ బీ ద రియ‌ల్ మేన్ అనిపించుకోవ‌డ‌మే ఈ ఛాలెంజ్ ముఖ్యోద్దేశం. ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్న కొర‌టాల శివ క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ పేరును నామినేట్ చేశారు. అయితే త‌న‌ను ఇంట్లో ఇంకా పిల్లాడిగానే ట్రీట్ చేస్తున్నార‌ని కాబ‌ట్టి ఇంటి ప‌నులు చేయ‌నీయ‌డం లేద‌ని, కాబ‌ట్టి ప్ర‌తిరోజూ తాను చేస్తున్న ప‌నుల‌కు సంబంధించిన వీడియో ఒక‌ట అప్‌లోడ్ చేస్తాన‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ తెలియ‌జేసిన సంగ‌తి తెలిసందే.

కొర‌టాల శివ‌కు చెప్పిన‌ట్లుగానే విజ‌య్ దేవ‌ర‌కొండ తాను ఇంట్లో చేస్తున్న ప‌నుల గురించి ఓ వీడియోను రూపొందించి సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. నిద్ర లేచిన త‌ర్వాత ఫ్రెష‌ప్ అవ‌డం, త‌మ్ముడితో క‌లిసి ఇండోర్ గేమ్స్ ఆడ‌టం వంటి ప‌నులు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన వీడియో చూసి రొటీన్‌గా ఉంద‌ని ఆయ‌న ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ఛాలెంజ్‌ను మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ దుల్క‌ర్ సల్మాన్‌కు పాస్ చేశారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

More News

ప్రభాస్ పక్కన బాలీవుడ్ బ్యూటీకే ప్రాధాన్యత..!

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20 సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. అదే స‌మ‌యంలో త‌న 21వ సినిమాను నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్

ట్రోల్స్‌కు రాజమౌళి కౌంటర్

దర్శకధీరుడు రాజమౌళి క్వారంటైన్ టైమ్‌లో కావాల్సినన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఇదే ఈయనకు కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టాయి. ఎందుకంటే ఓ ఇంటర్వ్యూలో

సూర్య సినిమాలు బ్యాన్..!

తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. అందుక‌నే ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుద‌ల‌వుతుంటాయి.

మరో బయోపిక్‌లో కీర్తి సురేశ్..?

మ‌ల‌యాళ చిత్రాల్లో నటించి ఆ త‌ర్వాత తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కీర్తిసురేశ్ త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌కు నేను శైల‌జ చిత్రంతో ప‌రిచ‌యమైంది.

కరోనా వార్‌లోనూ ఉద్ధవ్ థాక్రే వర్సెస్ రాజ్‌థాకరే!

కరోనా మహమ్మారి విస్తరిస్తుండటం.. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో రోజురోజుకూ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ఈ తరుణంలో కలిసికట్టుగా పనిచేయాల్సిన