ర‌ష్మిక‌కు మాటిచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

  • IndiaGlitz, [Monday,January 18 2021]

విజ‌య్ దేవ‌ర‌కొండ, హీరోయిన్ మంచి స్నేహితులు. గీత గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ చిత్రాల్లో క‌లిసి న‌టించారు. ఇప్పుడు త‌న స్నేహితుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ప్యాన్ ఇండియా మూవీ ‘లైగ‌ర్‌’లో న‌టిస్తుంటే.. ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోన్న అల్లు అర్జున్ ‘పుష్ప‌’లో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇద్ద‌రూ ప్యాన్ ఇండియా మూవీల్లో న‌టిస్తున్నారు. కాగా.. విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను సోమ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ లుక్ చాలా బావుంద‌ని అంద‌రూ అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ర‌ష్మిక మంద‌న్న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది.

‘‘కిల్ల‌ర్ పోస్ట‌ర్‌, నాకెంతో సంతోషంగా ఉంది. త్వ‌ర‌లోనే మాస్ట‌ర్ పీస్‌ను వెండితెర‌పై చూడ‌బోతున్నాం. నేనెంతో ఇష్ట‌ప‌డే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరీ జ‌గ‌న్నాథ్ , ఛార్మిల‌కు ఆల్ ది బెస్ట్‌. సినిమాలో సినిమా చూసే రోజు ఈల‌లు వేసి డ్యాన్స్ చేస్తాను’’ అని ర‌ష్మిక ట్వీట్ చేసింది. దీనికి విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌దులిస్తూ ‘‘ఈ సినిమా చూసేట‌ప్పుడు ఎంతో మంది ఈలలు, కేక‌లు వేస్తార‌ని నేను నీకు మాటిస్తున్నా రుషీ.ఈ విష‌యం నీకు కూడా తెలుసు. ఎందుకంటే నువ్వు కూడా కొంత భాగాన్ని చూశావు ’’ అని విజ‌య్ దేవ‌ర‌కొండ రిప్లై ఇచ్చారు.