సౌత్ నుంచి తొలి హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న సూపర్ స్టైలిష్ లుక్

  • IndiaGlitz, [Monday,June 14 2021]

విజయ్ దేవరకొండ క్రేజ్ పాన్ ఇండియా లెవల్ లో పెరుగుతోంది. అర్జున్ రెడ్డి చిత్రంతో సౌత్ మొత్తం విజయ్ వైపు చూసింది. బాలీవుడ్ లో కూడా ఆ మూవీ హాట్ టాపిక్ గా మారింది. తన యాటిట్యూడ్, మేనరిజమ్స్ తో విజయ్ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు.

బాలీవుడ్ నిర్మాతలు కూడా విజయ్ దేవరకొండతో సినిమా తెరకెక్కించేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇక ఇండియా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా గ విజయ్ దేవరకొండ 2వ స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచాడు. అతడి క్రేజ్ ఏంటో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. తాజాగా విజయ్ మరో ఘనత సాధించాడు.

బాలీవుడ్ సెలెబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని ఫోటో షూట్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయనతో ఫోటో షూట్ చేయడం నటీనటులకు ఓ కల. అలాంటి అవకాశం విజయ్ దేవరకొండకు దక్కింది. డబూ రత్నాని క్యాలెండర్ షూట్ లో విజయ్ పాల్గొన్నాడు. బైక్ పై ఉన్న విజయ్ లుక్ సూపర్ స్టైలిష్ గా ఉంది. తన స్టైల్, యాటిట్యూడ్ తో విజయ్ మతిపోగోట్టే విధంగా ఉన్నాడు.

ఇదీ చదవండి: 19 ఏళ్ల జయం.. నితిన్ భార్య మెమొరబుల్ పోస్ట్!

డబూ రత్నాని క్యాలెండర్ షూట్ లో ఛాన్స్ దక్కించుకున్న తొలి సౌత్ హీరో విజయ్ దేవరకొండ. డబూ రత్నాని క్యాలెండర్ షూట్ లో షారుఖ్ ఖాన్ సర్ ని చూశా. అప్పటి నుంచి రత్నాని షూట్ లో నేను కూడా పాల్గొనాలనే కోరిక ఉండేది. ఎట్టకేలకు నా కోరిక తీరింది. ఈ షూట్ వేగంగా, క్వాలిటీతో జరిగింది అని విజయ్ దేవరకొండ అన్నాడు.

ఇక డబూ రత్నాని కూడా విజయ్ పై ప్రశంసలు కురిపించాడు. విజయ్ చాలా కూల్ పర్సన్. న షూట్ లో పాల్గొన్న తొలి సౌత్ హీరో విజయ్. నేను చేసిన బెస్ట్ డెబ్యూ హీరో షూట్ విజయ్ దేవరకొండదే అని డబూ రత్నాని అన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'లైగర్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.