విజయ్ దేవరకొండ నెం 1..ఆ లిస్టులో టాప్ 5 హీరోలు వీళ్ళే..
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020 లిస్ట్ లో కొందరు టాలీవుడ్ యంగ్ హీరోలు టాప్ 5లో నిలిచి సత్తా చాటారు. టాలీవుడ్ యువ హీరోల క్రేజ్ దృష్ట్యా ఈ జాబితా ప్రకటించడం జరిగింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ అగ్రస్థానంలో నిలవగా, హీరో హీరో నాగశౌర్య 5వ స్థానం దక్కించుకున్నాడు. ఆ వివరాలు ఇవే..
విజయ్ దేవరకొండ
హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020లో విజయ్ దేవరకొండ టాప్ 1గా నిలిచాడు. విజయ్ దేవరకొండ ఈ ఘనత సాధించడం ఇది వరుసగా మూడవసారి. అర్జున్ రెడ్డి చిత్రం విజయ్ దేవరకొండకి యువతలో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.
రామ్ పోతినేని
ఎనెర్జిటిక్ హీరో రామ్ పోతినేని టాప్ 2 గా నిలిచాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం రామ్ క్రేజ్ ని మరింతగా పెంచింది. అప్పటి వరకు క్లాస్ హీరోగా ఉన్న రామ్ ని.. పూరి జగన్నాథ్ మాస్ గా మార్చేశాడు.
జూ.ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 3వ స్థానం దక్కించుకున్నాడు. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అభిమానులంతా ఆర్ఆర్ఆర్ లో కొమరం భీంగా ఎన్టీఆర్ సృష్టించబోయే సునామి కోసం ఎదురుచూస్తున్నారు.
రాంచరణ్
మెగా పవర్ స్టార్ రాంచరణ్ 4వ స్థానంలో నిలిచాడు. రాంచరణ్ కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. రంగస్థలంలో రాంచరణ్ సత్తా అందరూ గమనించారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో అల్లూరి కోసం వెయిటింగ్.
నాగశౌర్య
యంగ్ హీరో నాగశౌర్య తన హార్డ్ వర్క్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా శౌర్య 5 వ స్థానంలో నిలవడం విశేషం. ఇది అతడి ప్రతిభకు అద్దం పట్టే గుర్తింపు.ప్రస్తుతం శౌర్య 'లక్ష్య' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగశౌర్య సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com