మ్యూజిక్ వీడియోలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

  • IndiaGlitz, [Tuesday,June 26 2018]

యువ క‌థానాయ‌కుల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. అర్జున్ రెడ్డి త‌ర్వాత ఈ క్రేజ్ మ‌రింత పెరిగింది. టాక్సీవాలా, నోటా, గీత‌గోవిందం, కామ్రేడ్ చిత్రాల్లో న‌టిస్తూ విజ‌య్ దేవ‌ర‌కొండ చాలా బిజీగా ఉన్నారు.

ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ విజ‌య్ దేవ‌ర‌కొండ భానుశ్రీతేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మ్యూజిక్ వీడియోలో న‌టించ‌బోతున్నారు. దుర్గేశ్‌, సౌర‌భ్ ఈ మ్యూజిక్ వీడియాకి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు.

ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు మాళ‌విక బెన‌ర్జీ కూడా న‌టిస్తున్నారు. ఈ మ్యూజిక్ వీడియో చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే విడుద‌ల కూడా చేయ‌బోతున్నార‌ట‌.