శర్వానంద్‌తో విజయ్ దేవరకొండ హీరోయిన్...?
Send us your feedback to audioarticles@vaarta.com
డైరెక్టర్‌గా తొలి చిత్రం ‘ఆర్.ఎక్స్ 100’తో సూపర్‌హిట్ అందుకున్నాడు అజయ్ భూపతి. తర్వాత ‘మహా సముద్రం’ అనే మల్టీస్టారర్ కథను సిద్ధం చేసుకున్నాడు. రవితేజ, సిద్ధార్థ్ సహా పలువురు హీరోలను కలిశాడు. అంతా ఓకే అవుతున్న తరుణంలో ప్రాజెక్ట్ ఆగుతూ వచ్చింది. చివరకు శర్వానంద్ హీరోగా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారు? అనేదానిపై పలు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ మధ్య శర్వానంద్ జతగా సమంత నటిస్తుందని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. తర్వాత రాశీఖన్నా పేరు కూడా వినిపించింది. తర్వాత సాయిపల్లవి పేరు కూడా పరిశీలనలోకి ఉన్నట్లు టాక్ వినిపించింది. కాగా తాజా సమాచారం మేరకు.. శర్వానంద్ హీరోయిన్గా ఐశ్వర్యా రాజేశ్‌ను తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. పెర్ఫామెన్స్‌కు బాగా స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఐశ్వర్యా రాజేశ్‌ను తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అలాగే ఈ చిత్రంలో మరో హీరో పాత్రలో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడుతుందని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com