విజయ్ దేరవకొండ ఎమోషనల్ ట్వీట్
Send us your feedback to audioarticles@vaarta.com
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘లైగర్’. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రేక్షకాభిమానుల నుండి చాలా మంచి స్పందన వస్తుంది. అభిమానులు చేతికి టాటూలు వేయించుకోవడం, పోస్టర్‌కి పాలాభిషేకం చేయడం, బీరుతో అభిషేకం చేయడం వంటి పనులు చేశారు.
అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు, విజయ్ దేవరకొండ చాలా ఎమోషనల్ అయ్యాడు. ‘‘లైగర్ టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల రోజున మీరు నన్ను ఎంతో ఎమోషనల్‌కు గురి చేశారు. మీరే నా ప్రేమ. ఉద్వేగానికి లోను చేశారు. నా సినిమాను చూసి, నటనను గుర్తిస్తారా ప్రేక్షకులు అని ఎంతగానో ఆలోచించాను. ప్రేక్షకులు నా సినిమా చూడటానికి థియేటర్స్‌కు వస్తారా అని ఆలోచించాను. లైగర్ పోస్టర్ విడుదల రోజున అన్ని ప్రాంతాల్లో జరిగిన సెలబ్రేషన్స్ చూసి ఎంతో హ్యాపీగా అనిపించింది. టీజర్ విడుదలైనప్పుడు కూడా ఇలాంటి సెలబ్రేషన్సే జరుగుతాయని గ్యారంటీ ఇస్తున్నాను. నా మాటలు గుర్తు పెట్టుకోంది’’ అన్నారు.
My loves ??
— Vijay Deverakonda (@TheDeverakonda) January 19, 2021
Yesterday you made me emotional, happy emotional :’)
There was a time I worried if anyone would notice the work I did, if people would turn up to the theaters, yesterday we released the First Look poster of #Liger and the scenes of celebrations moved me.. https://t.co/PT2gA9MdDF
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments