విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' ప్రారంభం

  • IndiaGlitz, [Monday,July 02 2018]

హీరో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం డియర్ కామ్రేడ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దర్శకులు సుకుమార్, కొరటాల శివ, చంద్రశేఖర్ యేలేటి, మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

తొలి సన్నివేశానికి ఎం.ఎం.కీరవాణి క్లాప్ కొట్టగా, డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్ భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. సుకుమార్, కొరటాల శివ స్క్రిప్ట్ అందించారు.

డియర్ కామ్రేడ్ చిత్రాన్ని భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. సుజిత్ సరంగ్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీకి జై కృష్ణ మాటలు రాస్తున్నారు. రామాంజనేయులు ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

More News

ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో అంద‌రినీ మెప్పించే ప్యూర్ ల‌వ్ స్టోరీ 'తేజ్ ఐ ల‌వ్ యు' - సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో

తండ్రి టైటిల్‌తో నాగ్ మల్టీస్టారర్ మూవీ?

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఆగష్టు 24న‌.. విక్ర‌మ్ చిత్రం

'సామి'.. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఇది ఒకటి. 2003లో హరి దర్శకత్వంలో

గోపీచంద్‌.. ఏడోసారి

'తొలివలపు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్.. ఆ తర్వాత 'జయం', 'నిజం' సినిమాలలో విలన్‌గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.

అంద‌రినీ మెప్పించే ఫ్యామిలీ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ 'తేజ్ ఐ ల‌వ్ యు' - అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో