విజయ్ దేవర క్రేజీ ప్రాజెక్ట్..?
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ దేవరకొండ తెలుగుతో పాటు తమిళంలో కూడా రాణించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన గత చిత్రం 'నోటా' బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా ప్రయత్నాలు మాత్రం మానుకోవడం లేదు విజయ్ దేవరకొండ. ఇప్పుడు మరో తమిళ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలీవుడ్ వర్గాల సమాచారం.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీకార్తీక్ అనే డెబ్యూ డైరెక్టర్‌తో కలిసి పనిచేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఈయనతో పాటు యోగిబాబు, రాహుల్ రామకృష్ణ కలిసి నటించబోతున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
త్వరలోనే అధికారిక సమాచారం వెలువడుతుందని అంటున్నారు. ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో `డియర్ కామ్రేడ్` చిత్రంతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout