సైనికుడిగా విజయ్ దేవరకొండ

  • IndiaGlitz, [Wednesday,December 16 2020]

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌రుస సినిమాల‌కు క‌మిట్ అవుతున్నాడు. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ చేస్తున్న లైగ‌ర్ సినిమా సెట్స్‌పై ఉన్న సంగ‌తి తెలిసిందే. కోవిడ్ కార‌ణంగా ఆగిన ఈ సినిమా ఇంకా పునః ప్రారంభం కాలేదు. మ‌రో వైపు విజ‌య్ దేవ‌ర‌కొండ కోసం డైరెక్ట‌ర్ శివ నిర్వాణ ఎదురుచూస్తున్నాడు.

లైగ‌ర్‌తో పాటు జ‌న‌వ‌రి త‌ర్వాత‌ శివ నిర్వాణ సినిమాను కూడా మ‌న రౌడీ హీరో సెట్స్ పైకి తీసుకెళ‌తాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే బ్రిలియంట్ డైరెక్ట‌ర్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా మ‌రో సినిమా అనౌన్స్ అయ్యింది.

సుకుమార్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌డానికి ఇంకాస్త స‌మ‌యం ప‌ట్టేలానే ఉంది. ఎందుకంటే, విజ‌య్ దేవ‌ర‌కొండ క‌మిట్ అయిన రెండు సినిమాల‌ను పూర్తి చేయాల్సి ఉంది. అలాగే సుకుమార్ కూడా బ‌న్నితో పుష్ఫ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది.

ఈ క‌మిటెడ్ సినిమాల‌ను పూర్తి చేసిన త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సుక్కు సినిమా స్టార్ట్ అవుతుంది. అంటే ఎలా లెక్క‌లేసుకున్నా 2022లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది.

ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌లో కేదార్ సలగంశెట్టి నిర్మిస్తున్నారు. ప్రొడ్యూసర్‌గా ఈయనకు ఇదే తొలి చిత్రం. కాగా.. ఈ సినిమాను సుకుమార్ త‌న‌దైన స్టైల్లో పీరియాడిక్ మూవీగా తెర‌కెక్కిస్తాడ‌ట‌.

సినీ వ‌ర్గాల్లో వినిపిస్తున్న స‌మాచారం మేర‌కు ఈ చిత్రం ఇండియా.. పాకిస్థాన్ యుద్ధ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంద‌ట‌. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ సైనికుడిగా క‌నిపిస్తాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే చాలా రోజులు వెయిటింగ్ త‌ప్ప‌దు మ‌రి.

More News

త‌మ‌న్ కాపీ ట్యూన్‌.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్‌

మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ త‌మ‌న్‌కు ప్ర‌స్తుతం నెంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ ప‌నిచేస్తున్నాడు. చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన ఇలాంటి త‌రుణంలో త‌మ‌న్ చేసిన ఓ చిన్న త‌ప్పు..

డిజిట‌ల్ ఎంట్రీ ఇస్తున్న హ‌న్సిక‌

స‌మంత‌, త‌మ‌న్నా స‌హా ప‌లువురు స్టార్స్, టెక్నీషియ‌న్స్ డిజిట‌ల్ రంగం వైపు అడుగులేస్తున్నారు. సిల్వ‌ర్ స్క్రీన్‌కు స‌మాంత‌రంగా ఎదుగుతున్న డిజిట‌ల్ రంగం వైపు అంద‌రూ కొత్త త‌ర‌హా పాత్ర‌ల‌ను చేయ‌డానికి

విలేజ్ డాన్ క్యారెక్టర్‌లో సముద్రఖని

యువ వ్యాపారవేత్త, 'క్రియేటివ్‌ మెంటార్స్‌ యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ కాలేజీ' మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) కొవ్వూరి సురేష్‌రెడ్డి సినిమా నిర్మాణంలో

‘షకీలా’ ట్రైలర్ విడుదల...

ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో రిచా చద్దా.. పంకజ్ తివారి ప్రధాన పాత్రల్లో రూపొందిన బయోపిక్ ‘షకీలా’ ట్రైలర్ నేడు విడుదలైంది.

మెగా ఫ్యామిలీలో త్వరలో మరో పెళ్లి..

మెగా డాటర్ నిహారిక వివాహ వేడుకల ఇటీవలే ముగిసింది. మెగా ఫ్యామిలీ మొత్తం ఆ పెళ్లిలో చేసిన సందడి అంతా ఇంతా కాదు.