వారిలాగానే విజయ్ దేవరకొండ కూడా ..
Send us your feedback to audioarticles@vaarta.com
నటుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ 'పెళ్లిచూపులు'తో హీరోగా సక్సెస్ అయ్యి.. 'అర్జున్ రెడ్డి'తో స్టార్‌గా ఎదిగాడు. త్వరలోనే పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా పరిచయం కానున్నాడు. ఈ క్రేజీ స్టార్ ఇప్పుడు తన రేంజ్‌ను కేవలం సినిమాలకే పరిమితం చేయాలని అనుకోవడం లేదు. వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులను రీచ్ కావడానికి తన వంతు ప్రయత్నాలను స్టార్ట్ చేసేశాడు. అందులో భాగంగా ఇప్పుడు మరో ప్రయత్నాన్ని స్టార్ట్ చేశాడు. ఓ డాన్స్ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడట విజయ్ దేవరకొండ. టాలీవుడ్ నుండి ఇప్పటికే నాగార్జున, చిరంజీవి, సమంత వంటి బిగ్‌స్టార్స్ పలు షోలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా వీరి రూట్‌లో ట్రావెల్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఈ షోలో విజయ్ దేవరకొండతో ఓ హాట్ హీరోయిన్ కూడా షోను హోస్ట్ ఆమె ఎవరో కాదు.. 'వన్ నేనొక్కడినే' ఫేమ్ కృతిసనన్.
వివరాల్లోకెళ్తే.. ఇండియాలో మంచి పాపులర్ హిప్‌హప్ డాన్స్ షో 'షఫుల్'. ఈ డాన్స్ షో సీజన్ 4 వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఎవరైనా ఈ షోలో పాల్గొనాలంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. డిసెంబర్ 21 వరకు గడువుంది. వచ్చే ఏడాదిజనవరి 17 నుండి ఆడిషన్స్ జరుగుతాయి. ఈ షో సీజన్ 4కు విజయ్ దేవరకొండ, కృతిసనన్ హోస్ట్‌లుగా వ్యవహరించబోతున్నారు. దేశంలోని డాన్స్ టాలెంట్‌ను వెలికితీసే షో ఇది. ఇందులో విజేతలకు ఇరవై లక్షల రూపాయలను ప్రైజ్ మనీగా అందిస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com