బాల్యం నుంచి హీరోల వరకు... ఒక్కసారి గతంలోకి వెళ్లిన దేవరకొండ బ్రదర్స్, ఆసక్తికర అంశాలు.. ఇవిగో!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలోనే తనకంటూ స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇండస్ట్రీలో అన్న చాటు తమ్ముడిగా హీరోగా అడుగుపెట్టారు పలువురు స్టార్లు. వారు చూపిన బాటలోనే విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సైతం సినీరంగ ప్రవేశం చేశారు. ఆయన ‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆనంద్ నటిస్తున్న మరో చిత్రం ‘పుష్పక విమానం’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి దామోదర దర్శకత్వం వహించగా.. విజయ్ దేవరకొండ స్వయంగా నిర్మించారు. ఇందులో ఆనంద్ ఇన్నోసెంట్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. కాగా, ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ముఖాముఖిలో దేవరకొండ బ్రదర్స్ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. బాల్యం నుంచి సినిమా హీరోలు అయ్యేంతవరకు తమ జీవితంలోని పలు అంశాలను పంచుకున్నారు.
చిన్నప్పటి నుంచి తన తమ్ముడు ఆనంద్‌ను తల్లిదండ్రులు బాగా గారాబం చేసేవారని, తనను మాత్రం మూడో తరగతికే పెద్దవాడ్ని చేసేశారని విజయ్ వెల్లడించారు. ఇంట్లో ఆటబొమ్మలు అన్నీ తమ్ముడికే ఇచ్చేవారని, క్రికెట్ లో కూడా ఆనంద్ ఔటైనా నాటౌట్ అని చెప్పేవారని, దాంతో తనకు బాగా కోపం వచ్చేదని చెప్పాడు. తామిద్దరం చిన్నప్పటి నుంచి ఎక్కువగా హాస్టల్లోనే పెరిగామని, ఆనంద్ అక్కడ సైలెంట్‌గా ఉండేవాడని, కానీ ఇంటికొస్తే మాత్రం తనకు చుక్కలు చూపించేవాడని విజయ్ చెప్పారు. అనంతరం ఆనంద్ మాట్లాడుతూ, హాస్టల్లో తనను ఎవరైనా ఏదైనా అంటే అన్నయ్య ఊరుకునేవాడు కాదన్నాడు. తమ రౌడీయిజం చూసి హెడ్‌మాస్టర్ సైతం వణికిపోయేవారని విజయ్ తెలిపారు.
విజయ్, ఆనంద్‌ల తల్లిదండ్రులు స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్ స్టిట్యూట్ నడిపేవారు. దాంట్లో మోటివేషన్ క్లాసులు, స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు చెప్పేవారు. ఒక్కోసారి ఎవరైనా టీచర్లు రాకపోతే విజయ్ దేవరకొండ వెళ్లి క్లాసులు చెప్పేవాడట. దీనికి కొంత పారితోషికం కూడా ముట్టేది. ఇక విజయ్ సినిమాపై మక్కువతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటే, ఆనంద్ ఇంజినీరింగ్ పూర్తి చేసి అమోజాన్‌లో ఇంటర్న్‌షిప్ చేశారట. తద్వారా ఇంట్లో ఆనంద్ ఆర్థికంగా అండగా వుండారట. అమెరికాలోని డెలాయిట్‌లో ఆనంద్‌కు ఉద్యోగం రాగానే విజయ్ సహా ఇంట్లో వాళ్లంతా చాలా సంతోషపడ్డారట. ఆనంద్ యూఎస్ నుంచి రాగానే విజయ్ కు, ఫ్రెండ్స్ తో కలిసి మంచి ట్రీట్ ఇచ్చారట
ఇక పెళ్లి గురించి చెబుతూ.. మరింత నవ్వించారు దేవరకొండ బ్రదర్స్. ఆనంద్ పెళ్లి సరుకు అని... రిలేషన్ షిప్‌లో ఆనంద్ స్టిక్ అయి ఉంటాడని, తను అలా ఉండలేనని, కెరీర్ కోసమే ఆలోచిస్తానని విజయ్ చెప్పారు. అయితే విజయ్‌కు ఇండస్ట్రీలోకి రాకముందు 30-40 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారట. అలాగే ఎలాంటి ఇబ్బందినైనా తమ్ముడి దాకా రాకుండా చూశారట విజయ్. అలా తను ఎమోషనల్లీ స్ట్రాంగ్ పర్సన్ అయ్యేందుకు ఆనంద్ కారణమని తమ్ముడి గురించి గొప్పగా చెప్పారు విజయ్ దేవరకొండ.
నాన్న బర్త్ డేకు ఆనంద్ టీవీ కొంటే, ఫస్ట్ కారు, ఇల్లు నేను కొన్నానని విజయ్ గుర్తుచేసుకున్నారు. సినిమాల పట్ల, కెరీర్ పట్ల విజయ్ కమిట్ మెంట్ తనకు చాలా ఇష్టమని ఆనంద్ చెప్పారు. ఆనంద్ పాటలు కలెక్ట్ చేస్తూ అవి తనకు కూడా పంపిస్తారని విజయ్ తెలిపారు. ఇక పుష్పక విమానం సినిమా ట్రైలర్ ఈనెల 30న రిలీజ్ చేస్తున్నట్లు విజయ్ దేవరకొండ ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments