న‌వ‌ల ఆధారంగా 'నోటా'

  • IndiaGlitz, [Friday,September 28 2018]

విజ‌య్ దేవ‌ర కొండ తెలుగు, త‌మిళంలో న‌టించిన చిత్రం 'నోటా'. అక్టోబ‌ర్ 5న సినిమా విడుద‌ల‌వుతుంది. పొలిటిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాకు 'వెట్టాటమ్‌' అనే న‌వ‌ల ఆధారమ‌ట‌.

షాన్ క‌రుప్పుసామి ర‌చించిన వెట్టాట‌మ్ న‌వ‌ల హ‌క్కుల‌ను కోనుగోలు చేసిన సినిమా రూపంలో స్క్రిప్ట్‌ను రాయించార‌ట‌.

ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య న‌డిచే పొలిటిక‌ల్ గేమ్ ఇది. నేటి రాజ‌కీయ ప‌రిస్థితులను ఎన్నింటినో ఈ సినిమా ట‌చ్ చేస్తుంద‌ట‌. ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. మెహ‌రీన్ ఇందులో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టించారు.