సావిత్రితో విజయ్ దేవరకొండ..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరైన స్టార్ హీరోయిన్ ఇప్పుడు బిజి బిజీగా ఉంది. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ నాగాశ్విన్ దర్శకత్వంలో `మహానటి` సినిమాలో నటించనుంది. అలనాటి మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ సమంత జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి సావిత్రి భర్త జెమిని గణేషన్ పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. చివరకు ఆ పాత్రలో మలయాళ స్టార్ దుల్కర్‌ను తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి పెళ్ళిచూపులు ఫేమ్ విజయ్ దేవరకొండ జాయిన్ కానున్నాడట. మరి విజయ్ దేవరకొండ ఏ పాత్రలో నటిస్తాడనే దానిపై మాత్రం కచ్చితమైన సమాచారం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments