close
Choose your channels

సూర్యకాంతం సినిమా పెద్ద హిట్ కావాలి - విజయ్ దేవరకొండ

Sunday, March 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూర్యకాంతం సినిమా పెద్ద హిట్ కావాలి - విజయ్ దేవరకొండ

వ‌రుణ్ తేజ్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌పై నిహారిక కొణిదెల‌, రాహుల్ విజ‌య్ జంట‌గా న‌టించిన చిత్రం `సూర్య‌కాంతం`. ప్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ ఎర్రంరెడ్డి, సుజ‌న్ ఎర‌బోలు, రామ్ న‌రేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ శ‌నివారం హైద‌రాబాద్‌ జె ఆర్ సిలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తొలి టిక్కెట్‌ను విజ‌య్ దేవ‌ర‌కొండకు నీహారిక గిఫ్ట్ ఇచ్చారు. అనంతరం సూర్యకాంతం ఆడియో సీడీలను విజయ్ దేవరకొండ ఆవిష్కరించారు..

నిహారిక కొణిదెల మాట్లాడుతూ `` ఈరోజు ఈ సినిమా ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చిందంటే ముందు కార‌ణం మా అన్న వ‌రుణ్‌తేజ్‌. ఎక్క‌డో అమెరికాలోని ప్రొడ్యూస‌ర్స్‌ని, ఇక్క‌డ ఉన్న హీరో, డైరెక్ట‌ర్ అంద‌రినీ క‌లిపి ఓ ఫ‌జిల్ పీస్‌లా సెట్ చేసి సినిమా చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చాడు. మా నిర్మాత‌లు సందీప్, రామ్‌న‌రేష్‌, సుజ‌న్ గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ రాజ్‌గారికి థాంక్స్‌. మా స్క్రిప్ట్‌పై న‌చ్చి, నేను చేయ‌గ‌ల‌ను అని న‌మ్మ‌కంతో సినిమా చేసిన నిర్మాత‌ల‌కు పెద్ద థాంక్స్‌. మా డైరెక్ట‌ర్ ప్ర‌ణీత్‌.. త‌న‌ పేరు ఇండ‌స్ట్రీలో చాలా బాగా విన‌ప‌డుతుంది. అంద‌రం ఫ్యామిలీలా క‌ష్ట‌ప‌డి సినిమా చేశాం. రాహుల్ తో ప‌నిచేయ‌డాన్ని రెస్పెక్ట్‌గా భావిస్తున్నాను. త‌ను మంచి న‌టుడే కాదు.. మంచి వ్య‌క్తి. అందరికీ గౌర‌వం ఇస్తుంటాడు.

త‌న నుండి ఆ విష‌యాన్ని నేర్చుకున్నాను. ఈ సినిమాలో త‌ను అభిలాంటి వ్య‌క్తే. అభిగా ఎవ‌రిని తీసుకోవాల‌ని చాలా వెతికాం. కానీ త‌ను మ‌ణికొండ‌లోనే దొరికాడు. త‌న‌లాగానే మ‌రొక‌రు న్యాయం చేయ‌లేరేమో అనిపించింది. ఈ సినిమాలో ప్ర‌తి పాత్ర‌కు త‌గ్గ ఆర్టిస్టులు దొరికారు. పెర్లిన్‌ కూడా చాలా మంచి పాత్ర చేసింది. మార్క్ కె.రాబిన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను మ‌రో లెవ‌ల్‌కి తీసుకెళ్తాయ‌న‌డంలో సందేహం లేదు. హ‌రిగారు ప్ర‌తి విజువ‌ల్‌ను అందంగా చూపించారు. ఆయ‌న ఫ్యూచ‌ర్‌లో పెద్ద సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఎదుగుతారు. సుహాసినిగారు, శివాజీరాజాగారు.. ఇలా చాలా మంది సీనియ‌ర్స్‌తో క‌లిసి న‌టించాను. నా పాత్ర‌కు 100 శాతం న్యాయం చేశాన‌ని అనుకుంటున్నాను. అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

హీరో రాహుల్ విజ‌య్ మాట్లాడుతూ `` మా సినిమాకు ప‌నిచేసిన కెమెరామెన్ హ‌రిగారు, సంగీతం అందించిన‌ మార్క్ కె.రాబిన్‌గారు, య‌ష్ మాస్ట‌ర్‌, విజ‌య్ మాస్ట‌ర్‌గారు స‌హా అంద‌రికీ థాంక్స్‌. వ‌రుణ్ అన్న వ‌ల్ల‌నే నేను ఈ స్టేజ్‌పై నిల‌బ‌డి ఉన్నాను. ప్రణీత్‌ను పిలిపించి అభి క్యారెక్ట‌ర్‌కి నేను సూట్ అవుతాన‌ని ఆయ‌నే స‌జెస్ట్ చేశారు. ఫిలిం మేకింగ్ లో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను నిర్మాత‌లు ఏ రోజూ మా వ‌ర‌కు తీసుకు రాలేదు. పూజా చాలా బాగా న‌టించింది. నాకు వాళ్లిద్ద‌రి మీద చాలా గౌర‌వం ఉంటుంది. వాళ్లు ఎక్క‌డుంటే అక్క‌డ అట్మాస్పియ‌ర్ చాలా హ్యాపీగా ఉంటుంది.. ఈ డైర‌క్ట‌ర్‌కి క్లారిటీ ఉంది. నీహారిక‌గారు సూర్య‌కాంతం అనే టైటిల్‌కి యాప్ట్. `నీహారిక నా బెస్ట్ ఫ్రెండ్, త‌ను చాలా మంచి ఆర్టిస్ట్, త‌న‌కి ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌`ని డైర‌క్ట‌ర్ నాతో చెప్పాడు. ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నా. ఈ నెల 29న మా సినిమాను చూడండి`` అని అన్నారు.

రచయిత కృష్ణ‌కాంత్ మాట్లాడుతూ `` గుండ‌మ్మ‌గారి లాంటి సినిమాను రీమేక్ చేయాలంటే సూర్య‌కాంతం రోల్‌ చేసేవారు లేరు. తెర‌మీద నాకు ఆ పాత్ర పాజిటివ్ గానే క‌నిపిస్తోంది`` అని అన్నారు.

ఫైట్ మాస్ట‌ర్ విజయ్ మాట్లాడుతూ `` సూర్య‌కాంతం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ వ‌చ్చినందుకు ఆనందంగా ఉంది. నేను ఫ‌స్ట్ వ‌రుణ్‌తేజ్‌కి థాంక్స్ చెప్పాలి. ఇందులో రాహుల్ న‌టించ‌డానికి ముఖ్య కార‌ణం మా వ‌రుణ్‌బాబు. నేను నాగ‌బాబు అన్న‌య్య‌ని క‌లిసి `వ‌రుణ్‌ని క‌ల‌వాలి` అని అన్నా. `న‌న్ను అడుగుతావెందుకు నువ్వు వెళ్లి క‌లువు` అని అన్నారు. నేను వెళ్ల‌గానే అత‌ను `ఏం చేస్తున్నారు` అని అడిగారు. వెంట‌నే ఈ అవ‌కాశం గురించి చెప్పాడు. వ‌రుణ్‌బాబుకి థాంక్స్. ఈ నిర్మాత‌ల‌కి థాంక్స్. ప్ర‌ణీత్ చూడ్డానికి అలా ఉంటాడు కానీ, ఇండ‌స్ట్రీలో పెద్ద హిట్ కొడ‌తాడు. నీహారిక నా దృష్టిలో బంగారం. త‌న‌కి మంచి హిట్ రావాలి. మా నిర్మాత‌ల‌కు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి`` అని అన్నారు.

దివ్య మాట్లాడుతూ `` వ‌రుణ్‌కి థాంక్స్. ఈ ప్రాజెక్ట్ రాహుల్ చేయ‌డానికి మేజ‌ర్ రీజ‌న్ వ‌రుణ్‌. ప్ర‌ణీత్‌కి, సృజ‌న్‌కి, సందీప్‌కి ఆల్ ది బెస్ట్ `` అని అన్నారు.

కాల‌భైర‌వ మాట్లాడుతూ `` ఈ సినిమాకు నేనేం చేయ‌లేదు. కానీ ప్ర‌ణీత్ నా బెస్ట్ ఫ్రెండ్‌. త‌ను నాకు చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్‌. త‌ను నాకు స్టోరీ చెప్పాడు. నిన్నా మొన్నా అత‌ను నాకు క‌థ చెప్పిన‌ట్టే ఉంది. అత‌నికి ఈసినిమా పెద్ద హిట్ కావాలి. రాహుల్ చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్`` అని అన్నారు.

పెర్లిన్ మాట్లాడుతూ `` సూర్య‌కాంతం అనేది రామ్‌కామ్‌. ఫ‌న్ ల‌వింగ్ అంశాలు ఇందులో చాలా ఉంటాయి. థ‌రో ఎంట‌ర్‌టైన‌ర్ ఇది`` అని చెప్పారు.

మార్క్ మాట్లాడుతూ `` సినిమాకు ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. సూర్యకాంతానికి ప‌నిచేయ‌డం చాలా గొప్ప అవ‌కాశం. ప్ర‌తి అమ్మాయిలోనూ ఒక అర్జున్‌రెడ్డి పాత్ర ఉంటుంది. దాన్ని ఈ సినిమాలో చూస్తారు. మిమ్మ‌ల్ని మీరు ఈ సినిమాలో చూసుకుంటారు`` అని అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ `` విజ‌య్ మాస్ట‌ర్ లాస్ట్ సినిమా చేసిన‌ప్పుడు నాకు చూపించాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు. కానీ అప్పుడు కుద‌ర‌లేదు. ఈ సినిమా టీజ‌ర్ చూడ‌గానే థ్రిల్ ఫీల‌య్యా. వ‌రుణ్ సినిమా ఓపెనింగ్ అప్పుడు నీహారిక పాత్ర బావుంద‌ని చెప్పా. లేడీ అర్జున్‌రెడ్డిలాగా బాగా చేశావ‌ని అన్నా. వ‌రుణ్‌తో మాట్లాడిన‌ప్పుడు అత‌ను తానే ప్రెజెంట్ చేస్తున్న‌ట్టు చెప్పాడు. సినిమా పూర్తి కాగానే చెప్ప‌మ‌ని నేను చెప్పాను. త‌ను చెప్పేలోపే నేనే 15-20 రోజుల‌కు మ‌ళ్లీ అడిగా. `ఏమైంది సినిమా ఇంకా రెడీ కాలేదా` అని. అప్పుడు సందీప్‌కి వ‌రుణ్ ఫోన్ చేసి సినిమా చూడ‌మ‌ని చెప్పారు. నిర్మాత‌లు నాలాగే సుడిగ‌ల‌వాళ్లు. ఈ సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది. ఈ నెల 29న ఏపీ, తెలంగాణ‌లో మా ద్వారా విడుద‌ల కానుంది. ఈ ఇయ‌ర్ మా బ్యాన‌ర్‌లో ఇది మూడో హిట్ కావాల‌ని ఆకాంక్షిస్తున్నా. కొత్త డైర‌క్ట‌ర్ అయినా కేర‌క్టర్స్ ని బాగా హ్యాండిల్ చేశాడు. సినిమా పూర్త‌య్యాక ఇంటికి వెళ్లి నేను `అబ్బాయి ఎవ‌రు` అని అడిగా. విజ‌య్ మాస్ట‌ర్ వాళ్ల కొడుకు అని చెప్పారు. ఇద్ద‌రు అమ్మాయిల మ‌ధ్య‌లో స్ట్ర‌గుల్ అవుతూ రాహుల్ చేసిన తీరు న‌న్ను ఆక‌ట్టుకుంది. రాహుల్‌లో ఆ టాలెంట్ ఉంది కాబ‌ట్టి నేను ఎంక‌రేజ్ చేస్తున్నా. నా లైఫ్‌లోనే కాదు, ఎవ‌రి లైఫ్‌లోనూ సూర్య‌కాంతం ఉండ‌కూడ‌దు`` అని అన్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ `` నేను నీహారిక వాళ్ల నాన్న‌తో ప‌నిచేశాను. ఆయ‌న చాలా మంచి వ్య‌క్తి. ఆయ‌న్ని చూస్తే నాన్న ఫీలింగ్ వ‌చ్చింది. ఫ‌స్ట్ డే ఆయ‌న‌తో ప‌నిచేసిన‌ప్పుడు న‌న్ను చూసి `నువ్వు మంచోడివేన‌య్యా` అని అన్నారు. ఈ రోజు నాగ‌బాబుగారు పొలిటిక‌ల్ వ‌ర్క్ లో ఉండి, వ‌రుణ్ యుఎస్‌లో ఉండి, చ‌ర‌ణ్ అన్న యుఎస్‌లో ఉండి.. ఇక్క‌డికి రాలేక‌పోయార‌ని తెలిసింది. నేను నాగ‌బాబుగారి కొడుకుగా న‌టించా. అందుకే నీహారిక‌కు అన్న‌గా ఇక్క‌డికి వ‌చ్చాను. నేను రాహుల్ తండ్రితోనూ ప‌నిచేశా. ఒక సినిమాలో నా ఫైట్‌ని ఆయ‌న కొరియోగ్రాఫ్ చేశారు. టీజ‌ర్ చాలా బావుంది. సృజ‌న్‌, సందీప్ నా `అర్జున్ రెడ్డి`ని యు.ఎస్‌.లో విడుద‌ల చేశారు. వాళ్ల‌కు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి మాట్లాడుతూ `` సినిమా గురించి చెప్పాలంటే... అది చాలా ట‌ర్న్స్ తీసుకుంది. దిల్‌రాజుగారికి థాంక్స్. దిల్‌రాజుగారికి సినిమా అంటే ఎంత ఇష్ట‌మో, నాకు సినిమా అంటే అంత ఇష్టం. ఆయ‌న సినిమా చూసి తీసుకున్నారు. అందుకే మాకు చాలా ఆనందంగా అనిపించింది. నా జీవితంలో ఈ సినిమా చాలా స్పెష‌ల్ సినిమా. వ‌రుణ్ అన్న నాకు గైడింగ్ ప‌ర్స‌న్‌. నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. వాళ్లు మాతో అన్న‌ద‌మ్ములుగానే ఉన్నారు. మా కెమెరామేన్ నా ప‌నిని ఈజీ చేశారు. నేను చాలా ఇబ్బంది పెట్టింది రాబిన్‌ని. అత‌నితోనే ఉంటున్నా. కె.కె.గారు సింగిల్ కార్డు రాశారు. 15 నిమిషాల్లో ఒక పాట రాశారు. ఈ సినిమాకు ప‌నిచేసిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు. మా సూర్య‌కాంతం నాకు ప‌ర్ఫెక్ట్ మోటివేష‌న్‌. త‌ను పెర్ఫార్మెన్స్ చింపేసింది. రాహుల్ విజ‌య్ నాకు బ్ర‌ద‌ర్‌లాంటివాడు. అత‌న్ని సెట్‌లో స‌తాయించేశాను. పూజా క్యార‌క్ట‌ర్‌లో ప‌ర్లిన్ చాలా బాగా చేసింది`` అని అన్నారు.

సందీప్ మాట్లాడుతూ `` విజ‌య్‌దేవ‌ర‌కొండ‌గారికి, దిల్‌రాజుగారికి, వ‌రుణ్‌తేజ్‌గారికి ధ‌న్య‌వాదాలు. రామ్ న‌రేష్ అని ఒక నిర్మాత ఇక్క‌డికి రాలేదు. ఆయ‌న మాకు చాలా స‌పోర్ట్ చేస్తున్నారు. నాకు కిర‌ణ్‌; స‌్వాతి, గౌత‌మ్ మంచి ఫ్రెండ్స్. ప్ర‌ణీత్ మాకు ఈ ప్రాజెక్ట్ చెప్పిన‌ప్పుడు చాలా బావుంద‌ని అనిపించింది. ముద్ద‌ప‌ప్పు ఆవ‌కాయ నాకు చాలా బాగా న‌చ్చింది. అప్పుడే `ఫ్యూచ‌ర్‌లో సినిమా చేద్దాం` అని ప్ర‌ణీత్‌తో అన్నా. కొన్నాళ్ల‌కు ఆయ‌న క‌థ చెప్పారు. రాబిన్ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. టీమ్ అంద‌రికీ ధ‌న్యవాదాలు. సినిమా చూశా. చాలా బాగా వ‌చ్చింది. రాహుల్ చాలా అమాయ‌కంగా ఉంటాడు. అత‌నికి ఈ సినిమా మంచి బ్రేక్ కావాలి. క‌న్నారావుగారి ద‌గ్గ‌ర నుంచి టైటిల్ తీసుకున్నాం. రాజ్ నిహార్ చాలా బాగా చూసుకున్నారు. అత‌ను లేకుంటే ఇక్క‌డ మా ప‌నులేవీ కావు`` అని అన్నారు.

క‌ల్వ‌కుంట్ల తేజేస్వ‌ర్ మాట్లాడుతూ `` మాకు కొణిదెల ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. ఈ టైటిల్ నా ద‌గ్గ‌రే రిజిస్ట‌ర్ అయి ఉంది. నాగబాబుగారు నాకు ఫోన్ చేసి టైటిల్ అడిగారు. ఈ టైటిల్‌ని నేను రామ‌స‌త్య‌నారాయ‌ణ ద‌గ్గ‌ర నుంచి టేక‌ప్ చేశా. ర‌మ్య‌కృష్ణ‌గారిని ఉద్దేశంలో పెట్టుకుని క‌థ‌ను సిద్ధం చేయాల‌ని అనుకున్నాం. కానీ నీహారిక‌కు స‌రిపోతుంద‌నిపించి టైటిల్‌ను శాక్రిఫైజ్ చేశాను`` అని అన్నారు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment