ఏప్రిల్ 17న విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' టీజర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్లి చూపులు చిత్రంతో నటుడిగా, అర్జున్ రెడ్డి చిత్రంతో కమర్షియల్ స్టామినా ఉన్న హీరోగా పేరు తెచ్చుకొని, యువ హీరోల్లో సెన్సేషనల్ స్టార్ గా వెలుగొందుతున్న విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం టాక్సీవాలా. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రోడక్షన్ శరవేగంగా జరుపుకుంటోంది.
మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ 2 మరియు యువి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ కె ఎన్ నిర్మాత..రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ పాపులారిటీ ఎలా పెరిగిందో తెలిసిందే.
ఆ అంచనాలకు ఏ మాత్రం తీసుపోకుండా టాక్సీవాలా చిత్రం రూపుదిద్దుకుంటోంది. విజయ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్ర టీజర్ ని ఏప్రిల్ 17న విడుదల చేయబోతున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపోందుతున్న 18న ఈచిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండియర్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ... విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి తగ్గట్టుగానే అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా టాక్సీవాలా లో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను దర్శకుడు రాహుల్ తీర్చిదిద్దాడు. విజయ్ మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి.
డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ ఈ చిత్రం లో హైలైట్ గా నిలుస్తాయి. స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మించాం. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది.
అలాగే విజయ్ దేవరకొండ ని కొత్తగా ప్రేక్షకులు చూస్తారు. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. టాక్సీవాలా టీజర్ ని ఏప్రిల్ 17న విడుదల చేస్తున్నాం. మే 18న ఈచిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండియర్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments