మహేశ్ బ్రాండ్ లాగేసుకున్న రౌడీ స్టార్... స్పీడ్ మామూలుగా లేదుగా..!!
Send us your feedback to audioarticles@vaarta.com
చిన్నా చితకా క్యారెక్టర్లు చేసుకునే స్థాయి నుంచి తెలుగులో టాప్ స్టార్ రేంజ్‌కు చేరుకున్నారు విజయ్ దేవరకొండ. తన కృషి, పట్టుదలతో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా టాలీవుడ్‌లో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్‌ని సొంతం చేసుకున్నారు. ‘‘లైగర్’’ ద్వారా తొలిసారిగా విజయ్ పాన్ ఇండియా మార్కెట్‌లో అడుగుపెడుతున్నారు. ఇది ఇంకా రిలీజ్ కాకముందే బాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండకి ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. కరణ్ జోహార్ లాంటి నిర్మాతతో రౌడీ స్టార్ త్వరలో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతున్నారని ఫిలింనగర్ టాక్. సినిమాలతో పాటు ఎండార్స్‌మెంట్లలోనూ విజయ్ దూసుకెళ్తున్నారు.
ఇప్పటికే నేషనల్ లెవెల్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. తెలుగులో సూపర్‌స్టార్ మహేష్ బాబు తరువాత ఎక్కువ బ్రాండ్స్‌కి ప్రచారకర్తగా వుంది రౌడీ స్టారే. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం.. మహేష్ బాబుకి చెందిన ప్రెస్టీజియస్ బ్రాండ్ విజయ్ దేవరకొండ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా మహేష్ 'థమ్స్ అప్’’ యాడ్ లో నటిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, మహేష్ బాబుపై ఈ యాడ్ ను చిత్రీకరించారు. ఇప్పటికే ఇది టీవీల్లో ప్రసారమవుతోంది. అయితే ఇప్పుడు మహేష్ బాబుకి బదులుగా విజయ్ దేవరకొండ ఈ యాడ్ లో కనిపించబోతున్నారని టాక్. తెలుగు నాట తొలిరోజుల్లో మెగాస్టార్ చిరంజీవి ఈ యాడ్ లో నటించేవారు. ఆయన తరువాత మహేష్ ‘‘థమ్స్ అప్’’ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు విజయ్ చేతులోకి ఈ బ్రాండ్ వచ్చింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘‘లైగర్’’ షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. సంక్రాంతి కానుకగా లైగర్‌ను రిలీజ్ చేయాలని భావించినప్పటికీ.. వరుసగా పెద్ద సినిమాలు క్యూలో వుండటంతో మేకర్స్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి, మార్చి నెలలను పరీక్షలకు వదిలేసి.. ఏప్రిల్‌లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని టాక్ నడుస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాక్సిండ్ లెజెండ్ మైక్ టైసన్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com