తన పెళ్లి గురించి చెప్పిన విజయ్‌దేవరకొండ
- IndiaGlitz, [Thursday,July 25 2019]
క్రేజీ స్టార్ విజయ్‌దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్'తో సందడి చేయడానికి సమాయత్తమవుతున్నాడు. ఈ సినిమా రేపు థియేటర్స్‌లోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో విజయ్ పెళ్లి గురించిన ప్రస్తావన వచ్చింది. అయితే ఏమాత్రం ఆలోచించకుండా తనకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదనేశాడు. మరో ఐదేళ్ల తర్వాతే అంటే 35 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలియజేశాడు విజయ్ దేవరకొండ. 'డియర్ కామ్రేడ్' నాలుగు భాషల్లో విడుదలవుతుంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భరత్ కమ్మ డైరెక్ట్ చేశాడు.