అక్టోబర్ 5న విజయ్ దేవరకొండ నోటా విడుదల..
Send us your feedback to audioarticles@vaarta.com
నోటా విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది. అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విజయ్ దేవరకొండ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న నోటాపై భారీ అంచనాలున్నాయి.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరొకండకు ఇది తొలి ద్విభాషా చిత్రం. ఒకేసారి తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది ఈ చిత్రం. తమిళ్ వర్షన్ లోనూ విజయ్ సొంత డబ్బింగ్ చెప్పుకున్నారు.
మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది. స్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించింది. శాంతన కృష్ణణ్ సినిమాటోగ్రఫీ అందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments