వివాదంలోకి 'నోటా'

  • IndiaGlitz, [Monday,October 01 2018]

విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ చిత్రం 'నోటా'. కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా తెలుగు, త‌మిళంలో నిర్మించిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 4న విడుద‌ల కానుంది. అయితే టైటిల్‌పై ముందు నుండి కొన్ని అనుమానాలున్నాయి. అందుకు కార‌ణం.. నోటా అంటే నన్ ఆఫ్ ది అబౌవ్ అనే అప్ష‌న్‌. పై వారెవ్వ‌రూ కారు... ఈ ఆప్ష‌న్‌ను ఎన్నిక‌ల సంఘం ఓటింగ్ మీష‌న్‌లో రీసెంట్‌గా యాడ్ చేసింది. రీసెంట్‌గా జ‌రిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఎక్కువ శాతం మేర నోటా బ‌ట‌న్‌నే ప్ర‌జ‌లు ప్రెస్ చేశారు.

అయితే దీన్నే ఓ కార‌ణంగా చూపుతూ కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ఎన్నిక‌ల సంఘానికి ఓ రిక్వెస్ట్ చేశాడు. త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తే టైటిల్ ఎంతో కొంత మంది ఓట‌ర్ల‌పై ప్ర‌భావం చూపుతుంది కాబ‌ట్టి తెలంగాణ‌లో ఎన్నిక‌లు అయ్యే వ‌ర‌కు 'నోటా' సినిమాను ఆపు చేయాల్సిందిగా ఎన్నిక‌ల సంఘాన్ని కోరారు. మ‌రి దీనిపై సంఘం ఎలా స్పందిస్తుందో తెలియ‌డం లేదు కానీ.. సినిమా ద‌ర్శ‌కుడు, నిర్మాత‌ల‌కు, యూనిట్‌కు ఓ టెన్ష‌న్ ప‌ట్టుకుంది.