వివాదంలోకి 'నోటా'
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్‌దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ చిత్రం `నోటా`. కె.ఇ.జ్ఞానవేల్ రాజా తెలుగు, తమిళంలో నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది. అయితే టైటిల్‌పై ముందు నుండి కొన్ని అనుమానాలున్నాయి. అందుకు కారణం.. నోటా అంటే నన్ ఆఫ్ ది అబౌవ్ అనే అప్షన్. పై వారెవ్వరూ కారు... ఈ ఆప్షన్‌ను ఎన్నికల సంఘం ఓటింగ్ మీషన్‌లో రీసెంట్గా యాడ్ చేసింది. రీసెంట్గా జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో ఎక్కువ శాతం మేర నోటా బటన్‌నే ప్రజలు ప్రెస్ చేశారు.
అయితే దీన్నే ఓ కారణంగా చూపుతూ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఓ రిక్వెస్ట్ చేశాడు. త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ చిత్రాన్ని విడుదల చేస్తే టైటిల్ ఎంతో కొంత మంది ఓటర్లపై ప్రభావం చూపుతుంది కాబట్టి తెలంగాణలో ఎన్నికలు అయ్యే వరకు `నోటా` సినిమాను ఆపు చేయాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరారు. మరి దీనిపై సంఘం ఎలా స్పందిస్తుందో తెలియడం లేదు కానీ.. సినిమా దర్శకుడు, నిర్మాతలకు, యూనిట్‌కు ఓ టెన్షన్ పట్టుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout