'నోటా' వివాదం...
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ దేవరకొండ, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం `నోటా`. తెలుగు, తమిళంలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మాత. ఆనంద్ శంకర్ దర్శకుడు. ఇటీవలే టీజర్ కూడా రిలీజైంది. కాగా.. ఈ సినిమా తెలుగు రచన హక్కుల విషయంలో సమస్య వచ్చింది. ఒప్పందాన్ని అతిక్రమించి తనను పక్కన పెట్టేశారని రైటర్ శశాంక్ వెన్నెకలకంటి చెన్నై పోలీస్ కమీషనర్‌కు పిర్యాదు చేశారు.
అంతే కాకుండా ఎవరికీ ఓటు వేయొద్దు అనే పదం `నోటా`ని టైటిల్‌గా పెట్టడం ఏంటని పలువురు నెటిజన్లు కూడా తమ అభ్యంతరాన్ని తెలుపుతున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. అక్టోబర్‌లో సినిమా విడుదలవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments