విజ‌య్ దేవ‌రకొండ కొత్త మూవీ టైటిల్‌

  • IndiaGlitz, [Friday,December 08 2017]

ప్ర‌స్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యూత్ హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక‌డు. పెళ్ళి చూపులు స‌క్సెస్ త‌ర్వాత విడుద‌లైన 'అర్జున్ రెడ్డి' సెన్సేష‌న‌ల్ హిట్ కావ‌డంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. దీంతో వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్నారు.

ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్నిగీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి 'గీతా గోవిందం' అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై నిర్మాత‌ల నుండి అధికార‌క ప్ర‌క‌టన వెలువ‌డ‌నుంది. క‌న్న‌డ బ్యూటీ రష్మిక మండ‌న్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది కాకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలు పైప్‌లైన్‌లో ఉన్నాయి.