కొత్త వ్యాపారంలోకి క్రేజీ స్టార్

  • IndiaGlitz, [Thursday,January 02 2020]

పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. తర్వాత ఈ స్టార్ హీరో చేసిన నోటా, డియర్ కామ్రేడ్ చిత్రాలేవీ ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదు. ఇప్పుడు తదుపరి సినిమాలపై ఫోకస్‌గా ఉన్న ఈ యువ హీరో సినిమాతో పాటు ఇతర రంగాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే నిర్మాతగా మారిన విజయ్ దేవరకొండ.. రౌడీ అనే పేరుతో బట్టల వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి కూడా తెలిసిందే.

తాజాగా ఈయన మరో వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నాడు. అదే మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్. ప్రముఖ థియేటర్స్ సంస్థ ఏషియన్ సినిమాస్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్‌ను ప్రారంభించింది. గత ఏడాది మహేశ్‌తో కలిసి ఏఎంబీ సినిమాను స్టార్ట్ చేసిన ఏషియన్ సంస్థ..విజయ్ దేవరకొండతో కలిసి ఏవీడీ సినిమాను స్టార్ట్ చేయనుందట. మహబూబ్ నగర్‌లో మూడు స్క్రీన్స్ మల్టీప్లెక్స్‌ను త్వరలోనే చేయబోతున్నారట. నేటి తరం కుర్ర కథానాయకులకు భిన్నంగా ఆలోచిస్తూ విజయ్ దేవరకొండ ముందుకెళ్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.

ఈ ఏడాది వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ఫిబ్రవరి 14న విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నెలలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాతో హిందీలోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ బాడీ చేస్తున్నాడట.