విజయ్ దేవరకొండ 'హీరో'  మూవీ  ప్రారంభం

  • IndiaGlitz, [Sunday,May 19 2019]

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం 'హీరో' ఆదివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

ఆనంద్ అన్నామ‌లై ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌బోతున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ హీరో హీరోయిన్‌ల‌పై క్లాప్ కొట్టారు. అలాగే ద‌ర్శ‌కుడికి స్క్రిప్ట్‌ను అందించారు.'

ఎమ్మెల్యే ర‌వికుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక‌ల్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో 'హీరో' సినిమా తెర‌కెక్క‌నుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ తొలిసారి ఇలాంటి డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీలో న‌టిస్తున్నారు.

పేట్ట ఫేమ్ మాళ‌వికా మోహ‌న‌న్ ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమ‌లోకి హీరోయిన్‌గా అడుగుపెడుతున్నారు. ప్ర‌దీప్‌కుమార్ సంగీతం అందించ‌బోయే ఈ చిత్రానికి ముర‌ళి గోవింద రాజులు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.