విజయ్ దేవరకొండ 'హీరో' మూవీ ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ దేవరకొండ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం `హీరో` ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది.
ఆనంద్ అన్నామలై ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టారు. అలాగే దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందించారు.'
ఎమ్మెల్యే రవికుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మ్యూజికల్ థ్రిల్లర్ జోనర్లో `హీరో` సినిమా తెరకెక్కనుంది. విజయ్ దేవరకొండ తొలిసారి ఇలాంటి డిఫరెంట్ జోనర్ మూవీలో నటిస్తున్నారు.
పేట్ట ఫేమ్ మాళవికా మోహనన్ ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి హీరోయిన్గా అడుగుపెడుతున్నారు. ప్రదీప్‌కుమార్ సంగీతం అందించబోయే ఈ చిత్రానికి మురళి గోవింద రాజులు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com