జూన్ తరువాత విజయ్ దేవరకొండ, మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం?

  • IndiaGlitz, [Wednesday,February 07 2018]

పెళ్లిచూపులు' సినిమాతో ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకుని, అర్జున్ రెడ్డి' మూవీతో స్టార్ హీరోగా ఎదిగిపోయారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత విజయ్ స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. ఈయన కాల్షీట్స్ కోసం నిర్మాతలు.. సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారంటే విజయ్ కున్న ప్రాముఖ్యత అర్ధం చేసుకోవచ్చు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేకర్స్.. విజయ్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేయ‌డం కోసం రూ. రెండున్నర కోట్ల చెక్ అడ్వాన్స్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. స‌రికొత్త క‌థ‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా ద్వారా ఓ నూతన దర్శకుడు పరిశ్రమకు పరిచయం కానున్నారు.

అలాగే... విజయ్ సరసన కన్నడ నటి రష్మిక మందన్న కథానాయికగా నటించ‌నుంద‌ని స‌మాచారం. ఈ సినిమా ఈ సంవత్సరం జూన్ తర్వాత చిత్రీకరణ జరుపుకోనుంది. విజయ్, రష్మిక ఇప్ప‌టికే పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. అంతేగాకుండా...విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న తాజా చిత్రాల‌లో ఒక‌టైన టాక్సీ వాలా' ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. మార్చి నెలలో ఈ సినిమా విడుదల కానున్నట్టు సమాచారం. అలాగే విజయ్ అతిథి పాత్ర‌లో నటిస్తున్న మహానటి' సినిమా కూడా మార్చి 30న విడుదల కానుంది. చూస్తుంటే.. ఈ ఏడాది విజ‌య్ హ‌వా బాగానే ఉండ‌బోతుంద‌న్న‌మాట‌.

More News

'రోషగాడు' తో సందేశాన్ని ఇవ్వనున్న విజయ్ ఆంటోని

పోలీస్ కథల నేపథ్యంలో సాగిన సినిమాలకి విజయాల శాతం ఎక్కువ.

హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో 'అ!'...!

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా అనే నిర్మాణ సంస్థను స్థాపించి..‘అ!’

తారక్ , త్రివిక్రమ్ మూవీ డిటైల్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో

మ‌ల‌యాళ టైటిల్ చెప్పిన బ‌న్ని

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగులోనే కాదు మలయాళంలో కూడా అభిమానులు ఉన్నారు. అందుకే బన్నీ సినిమాలు మలయాళంలో కూడా అనువదింపబడుతూ ఉంటాయి. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' కూడా మలయాళంలో డబ్ కానుంది.

గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం నా మనసును కలచివేసింది. - డా.మంచు మోహన్ బాబు

తిరుపతిలో చదువుకునే రోజుల్లో నేనూ, ఆయన ఒకే రూమ్ లో  ఉండేవాళ్ళం. ఆయన బ్రదర్ నా క్లాస్ మేట్. నాకు అత్యంత సన్నిహితుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు. ఎలక్షన్స్ టైం లో ఆయన తరపున ఎన్నోసార్లు ప్రచారానికి కూడా వెళ్ళాను.