ఆగస్టులో రానున్న విజయ్ దేవరకొండ చిత్రాలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎవడే సుబ్రమణ్యం, పెళ్ళి చూపులు చిత్రాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఈ సినిమా విజయ్‌కు యూత్‌లో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు విజయ్. ఇటీవలే మహానటిలో అతిథి పాత్రలో కనిపించిన విజయ్.. ఆగస్టు నెలలో రెండు సినిమాలతో సందడి చేయనున్నారు. ఆ రెండు చిత్రాలే టాక్సీ వాలా, గీత గోవిందం.
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన టాక్సీవాలా చిత్రీకరణ పూర్తిచేసుకుని.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మే నెలలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా.. సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుందని తెలుస్తోంది. అదే ఆగస్టులో విజయ్ దేవరకొండ నటించిన మరో చిత్రం గీత గోవిందం కూడా విడుదల కానుందని సమాచారం. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించింది. మొత్తానికి.. ఆగస్టులో విజయ్ దేవరకొండ రెండు చిత్రాలతో డబుల్ ధమాకా ఇవ్వనున్నారన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com