మే18న జీఏ 2 మరియు యువి పిక్చర్స్ విజయ్ దేవరకొండ చిత్రం రిలీజ్

  • IndiaGlitz, [Friday,February 23 2018]

పెళ్లి చూపులు చిత్రంతో నటుడిగా, అర్జున్ రెడ్డి చిత్రంతో కమర్షియల్ స్టామినా ఉన్న హీరోగా పేరు తెచ్చుకొని, యువ హీరోల్లో సెన్సేషనల్ స్టార్ గా వెలుగొందుతున్న విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ 2 మరియు యువి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయమౌతున్నారు.

అంతే కాదు... రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా తెరెగేట్రం చేస్తున్నారు. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ పాపులారిటీ ఎలా పెరిగిందో తెలిసిందే. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసుపోకుండా టాక్సీవాలా చిత్రం రూపుదిద్దుకుంటోంది. విజయ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్రానికి టైటిల్ ని మెద‌టి లుక్ ని త్వ‌ర‌లో విడుద‌ల చేస్తారు..

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ మాట్లాడుతూ... విజయ్ దేవరకొండకున్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి తగ్గట్టుగానే అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను దర్శకుడు రాహుల్ తీర్చిదిద్దాడు. విజయ్ మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ ఈ చిత్రం లో హైలైట్ గా నిలుస్తాయి. స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మించాం. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మే 18న ఈచిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండియర్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రానికి చ‌క్క‌ని టైటిల్ ని మ‌రియు మెద‌టి లుక్ ని త్వ‌ర‌లో విడుద‌ల చేస్తాము. అని అన్నారు.

More News

అనురాగ్ హీరొగా 'ఈ క్షణమే' మొదలైంది

జనని క్రియేషన్స్ పతాకంపై అనురాగ్ ను హీరోగా పరిచయం చెస్తూ పొకూరి లక్ష్మణా చారీ నిర్మిస్తొన్న చిత్రం 'ఈ క్షణమే'.

సస్పెన్స్ థ్రిల్లర్ 'యమ్6' ట్రైలర్ లాంచ్!!

విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరి,శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ బేనర్స్ పై విశ్వనాథ్ తన్నీరు,సురేష్.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'యమ్6'.

అఖిల్ ఖాతాలో మరో దర్శకుడు

ఇటీవల విడుదలైన‘హలో’చిత్రంతో అటు అభిమానులను,ఇటు ప్రేక్షకులను మెప్పించాడు యువ కథానాయకుడు అక్కినేని అఖిల్

పవన్ కు కలిసొచ్చిన తేదీల్లో వస్తున్న సూపర్ స్టార్స్

బద్రి(2000),ఖుషి(2001)..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయిన చిత్రాలివి.

వరుణ్ తేజ్.. ఈ ఏడాది కూడా అలాగే!

2014లో విడుదలైన ముకుంద చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన మెగా హీరో వరుణ్ తేజ్..