రాజకీయ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సినిమా

  • IndiaGlitz, [Tuesday,March 06 2018]

సంచ‌ల‌న విజ‌యం సాధించిన అర్జున్ రెడ్డి'తో ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌లోనే హాట్ టాపిక్‌గా మారిపోయారు యువ క‌థానాయ‌కుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్.. చేతినిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ వేస‌విలో ఏకంగా మూడు సినిమాల‌తో ఆయ‌న సంద‌డి చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. వాటిలో ఏ మంత్రం వేశావే' ఈ నెల 9న విడుదల కానుండగా.. టాక్సీవాలా' మే 18న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అత‌ను కీల‌క పాత్ర‌లో న‌టించిన 'మహాన‌టి' కూడా వేస‌విలోనే తెర‌పైకి రానుంది. ఇదిలా వుంటే.. టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లో కూడా తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు ఈ వర్ధమాన నటుడు.

అందుకే త‌మిళ దర్శకుడు ఆనంద్ శంకర్ చెప్పిన విభిన్నమైన కథతో.. తమిళంలో ఓ సినిమా చేయడానికి సిద్ధపడ్డారు విజయ్. త‌మిళంతో పాటు తెలుగులోనూ ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా సోమవారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. కాగా, రాజకీయ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుంద‌ని తెలిసింది. ఒక రాజకీయ నేత వారసుడిగా.. రాజకీయాలను, ప్రజలను ప్ర‌భావితం చేసే పాత్రలో విజయ్ కనిపించనున్నారని సమాచారం. అర్జున్ రెడ్డి' తరహాలో ఈ సినిమాని కూడా యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. మెహ్రీన్ కథానాయికగా నటిస్తున్న‌ ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది.

More News

రవితేజ, కళ్యాణ్ కృష్ణ మూవీ అప్ డేట్

మాస్ మహరాజా రవితేజ కథానాయకుడిగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా'నేల టికెట్' (ప్రచారంలో ఉన్న టైటిల్).

డ‌బ్బింగ్ ప‌నిలో బిజీ అయిపోయిన చ‌ర‌ణ్‌

రామ్ చరణ్, సమంత జంటగా నటించిన సినిమా 'రంగస్థలం'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 1985నాటి పరిస్థితులకు అద్దం పడుతూ పూర్తిగా గ్రామీణ వాతావరణంలో రూపుదిద్దుకుంది ఈ మూవీ.

ఆ దర్శకుడితో బన్నీ మరోసారి..?

వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో యువ కథానాయకుడు అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటారు.

'తారామణి' మొదటి పాటను విడుదల చేసిన శ్రీలేఖ

అంజలి,ఆండ్రియా,వసంత్ రవి ప్రధాన పాత్రల్లో రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'తారామణి'.

పతిఘటన, నేటిభారతం తరహాలో... తారానీలు కార్పొరేషన్ చిత్రం

తారానీలు కార్పొరేషన్ పతాకంపై అనురాగ్(ఎమ్.ఎస్.బాబు) స్వీయ దర్శకత్వంలో