క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ సంస్థ‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, క్రాంతిమాధ‌వ్ చిత్రం..

  • IndiaGlitz, [Friday,October 12 2018]

తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌తిష్మాత్మ‌క నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ సంస్థ‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.46 గా విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా వ‌స్తోంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో ఈయ‌న చేస్తోన్న తొలి సినిమా ఇది. అక్టోబ‌ర్ 18న హైద‌రాబాద్ లో ఈ చిత్ర ఓపెనింగ్ జ‌ర‌గ‌నుంది.

అదే రోజు ఈ చిత్రంలో న‌టించ‌బోయే న‌టీన‌టులు.. చిత్రానికి ప‌ని చేయ‌నున్న సాంకేతిక నిపుణుల గురించి పూర్తి వివ‌రాలు చిత్ర‌యూనిట్ తెలియ‌జేయ‌నుంది. ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొంద‌నున్న ఈ చిత్రంలో రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్, ఇసాబెల్లె డి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. జేకే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత కేఎస్ రామారావు స‌మ‌ర్పిస్తోన్న ఈ చిత్రాన్ని కేఎ వ‌ల్ల‌భ నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా,ఐశ్వ‌ర్యా రాజేష్,ఇసాబెల్లె డి

More News

రికార్డుల‌కు క్రియేట్ చేస్తున్న యంగ్ టైగ‌ర్‌...

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 'అర‌వింద స‌మేత‌'.. 'వీర రాఘ‌వ‌' చిత్రంతో ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుక వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

#మీటూ ప్యాష‌నైపోయింద‌న్న డైరెక్ట‌ర్

కాస్టింగ్‌కౌచ్‌.. లైంగిక బాధింపులపై బాలీవుడ్‌లో మీటూ ఉద్య‌మం జోరుగా సాగుతుంది. ఎంతో మంది మ‌హిళ‌లు త‌మ ఎదుర్కొన్న లైంగిక ఇబ్బందులను ఆరోపిస్తున్నారు.

'మ‌హాభార‌తం' పై రైట‌ర్ అసంతృప్తి

మలయాళ దర్శకుడు శ్రీకుమరన్ డైరెక్షన్ లో మహాభారతాన్ని తెరకెక్కతుంద‌ని..., హిందీ, తెలుగు, తమిళం సహా అన్నీ వుడ్స్ లోని ప్రముఖ నటులు నటించనున్నారని వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే.

తండ్రులుగా త‌న‌యులు...

సినీ రంగంలో తండ్రి పాత్ర‌లో త‌నయుడు న‌టించ‌డం అనేది ఓ అనుభూతి. ఇప్పుడు ఇండ‌స్ట్ర‌లో ఇద్ద‌రు హీరోలు వారి తండ్రుల పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

సైరాలో విజ‌య్‌సేతుప‌తి లుక్‌..

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో..సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేందర్‌ రెడ్డి దర్శకుడిగా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో..