హిందీలోకి విజ‌య్ దేవ‌ర‌కొండ‌

  • IndiaGlitz, [Wednesday,September 19 2018]

'పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, గీత‌గోవిందం'...వ‌రుస విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో క్రేజ్‌ను సొంతం చేసుకున్న స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతున్న 'నోటా' చిత్రంతో తమిళ ప్రేక్ష‌కుల‌కు కూడా ప‌రిచ‌యం కాబోతున్నాడు. కాగా ఈ యువ క‌థానాయ‌కుడు ఇప్పుడు హిందీలో కూడా న‌టించ‌బోతున్నాడని స‌మాచారం.

తెలుగువారైన‌ ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత‌లు రాజ్‌, కృష్ణ డి.కెలు బాలీవుడ్ ప‌లు చిత్రాల‌ను రూపొందించిన సంగ‌తి తెలిసిందే. వీరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్నాడ‌ట‌. అది కూడా హిందీలో. అంటే ఈ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీకి విజ‌య్ దేవ‌ర‌కొండ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.