ఫ్యామిలీ సబ్జెక్ట్‌లో విజయ్ దేవరకొండ
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటివరకు యువతనే టార్గెట్ చేసుకున్న సినిమాల్లో.. కథానాయకుడిగా నటించారు యంగ్ హీరో విజయ్ దేవరకొండ, పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి చిత్రాల విజయాలతో యువతలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. అతి త్వరలో ఓ కుటుంబ కథా చిత్రంలో నటించబోతున్నారని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు నిర్మించనున్న ఈ మూవీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందని సమాచారం.అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com