విజయ్ దేవరకొండ `హీరో` ప్రారంభం కానుంది..
Send us your feedback to audioarticles@vaarta.com
క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో డెబ్యూ డైరెక్టర్ ఆనంద్ ఆన్నామలై దర్శకత్వంలో `హీరో` సినిమా అనే సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే బడ్జెట్ ఎక్కువ అయ్యే కారణాలుండటంతో సినిమాను కొన్నాళ్లు పాటు ఆపేశారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాను ట్రాక్ ఎక్కిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత మేర చిత్రీకరణను పూర్తి చేశారు. 15 రోజుల పాటు జరిగిన చిత్రీకరణలో రేసింగ్ కోసం రోజుకు 50 లక్షల రూపాయలు మేర ఖర్చు పెట్టారట. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రేసర్ పాత్రలో కనపడబోతున్నారట. అందుకోసం కోయంబత్తూరులో రేసర్ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణను కూడా తీసుకున్నారట.
త్వరలోనే మరికొన్ని రేసింగ్ సన్నివేశాలను చిత్రీకరించేలా ప్లాన్స్ జరుగుతున్నాయట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో `వరల్డ్ ఫేమస్ లవర్` సినిమా రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com