చిత్రీకరణ తుదిదశ లో విజయ్ దేవరకొండ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
యూత్ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం గీతా గోవిందం` (ప్రచారంలోనున్న పేరు). ఛలో` ఫేమ్ రష్మిక మందన్నా ఇందులో కథానాయికగా నటిస్తోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ స్వరాలను సమకూరుస్తున్నారు.
ఇదిలా వుంటే.. చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న ఈ చిత్రం మరో పది రోజుల్లో షూటింగ్ పార్టును పూర్తిచేసుకోబోతోందని తెలిసింది. మరోవైపు నిర్మాణానంతర పనులను కూడా చిత్ర బృందం చేపట్టింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మొత్తం కార్యక్రమాలను పూర్తి చేసి.. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శ్రీరస్తు శుభమస్తు` వంటి విజయవంతమైన చిత్రం తరువాత పరశురామ్, అర్జున్ రెడ్డి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా కావడంతో.. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com