Family Star:రౌడీ హీరో 'ఫ్యామిలీ స్టార్' ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసిందిగా.. వినేయండి..

  • IndiaGlitz, [Wednesday,February 07 2024]

రౌడీ హీరోగా విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. తనకు 'గీత గోవిందం' లాంటి బ్లాక్‌బాస్టర్ ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా 'నంద నందనా' అంటూ సాగే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా.. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. గోపిసుందర్ సంగీతం కంపోజ్ చేశారు.

పరశురామ్, విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మొదటి చిత్రం ‘గీత గోవిందం’. అప్పట్లో ఈ సినిమా నుంచి తొలుత విడుదలైన ‘ఇంకేం ఇంకేం కావాలే’ లిరికల్ సాంగ్ రికార్డులు క్రియేట్ చేసింది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట సినిమాపై భారీ హైప్ తెచ్చింది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్‌గా 'నంద నందనా' పాటను విడుదల చేశారు. మూవీలో విజయ్ దేవరకొండకు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇందులో విజయ్ క్యారెక్టర్ తన గత సినిమాలకంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్‌గా నటించనున్నాడు.

కాగా 2024 సంక్రాంతికి సినిమాను విడుదల చేద్దామనుకున్నారు. కానీ సినిమాలు ఎక్కువగా ఉండటంతో పోటీ నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు ఏప్రిల్‌లో విడుదలకు ప్లాన్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ ఏప్రిల్ 5న విడుదల చేద్దాం అనుకున్నారు. అయితే సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో మూవీ రిలీజ్‌ను వాయిదా వేశారు. దీంతో ఆరోజున ‘ఫ్యామిలీ స్టార్’ను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు దిల్ రాజు ప్లాన్ చేశారు.

ఇదిలా ఉంటే ఇటీవల విజయ్ దేవరకొండ సినిమాలు ఆశించిన స్థాయిలో సూపర్ హిట్ కాలేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'లైగర్' మూవీ పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఇక గతేడాది వచ్చిన 'ఖుషీ' సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టలేదు. దీంతో ఈ సినిమాపైనే హోప్స్ పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా విజయ్‌కు మరో బ్లాక్‌బాస్టర్ ఇస్తుందో లేదో తెలియాలంటే ఏప్రిల్ 5 వరకు ఆగాల్సిందే.

More News

Modi:దేశాన్ని విభజించే కుట్రలను సహించేది లేదు.. ప్రధాని మోదీ ఫైర్..

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా

DSC Notification:నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

ఏపీ నిరుద్యోగులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) విడుదలైంది.

Babu Mohan:బీజేపీకి ఊహించని షాక్.. పార్టీకి బాబుమోహన్ రాజీనామా..

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి బాబుమోహన్(Babu Mohan) పార్టీకి గుడ్ బై చెప్పారు.

YS Sharmila:ప్రత్యేక హోదా కోసం.. సీఎం జగన్, చంద్రబాబుకు వైయస్ షర్మిల లేఖాస్త్రాలు..

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) దూకుడు పెంచారు.

AP Budget:రూ.2.86లక్షల కోట్లతో ఏపీ మధ్యంతర బడ్జెట్.. వివరాలు ఇవే..

సంక్షేమ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివిధ పథకాలు ఫలితాలనిస్తున్నాయని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో తెలిపారు.