తుఫాను బాధితుల‌కు విజ‌య్‌దేవ‌ర కొండ స‌పోర్ట్‌...

  • IndiaGlitz, [Monday,October 15 2018]

నిన్న కేర‌ళలో వ‌ర‌ద‌ల కార‌ణంగా భారీ ఆస్థిన‌ష్టం, ప్రాణ న‌ష్టం జ‌రిగింది. కోట్ల మంది ప్ర‌జ‌లు ముందుకు వ‌చ్చి తమ వంతుగా స‌హ‌కారాన్ని అందించారు. ఇప్పుడు తిత్లీ తుఫాను రూపంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఓ క‌ష్టాన్ని ఎదుర్కొంది. ఈ విష‌యం తెలుసుకున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్‌దేవ‌ర‌కొండ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలబ‌డాల‌ని త‌న అభిమానుల‌ను కోరారు. అంతే కాకుండా.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడికి ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్ధిక సాయాన్ని ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉంటే వెంట‌నే స్పందిస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను అంద‌రూ అభినందిస్తున్నారు.