యూరప్‌లో ఎవరితో ఉన్నదీ చెప్పని విజయ్ దేవరకొండ

  • IndiaGlitz, [Wednesday,June 02 2021]

విజయ్ దేవరకొండ రేర్ రికార్డ్ కొట్టాడు. ఇంగ్లీష్ డైలీ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతియేటా నిర్వహించే 'మోస్ట్ డిజైరబుల్ మ్యాన్' సర్వేలో వరుసగా మూడోసారి టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఎవరు ఈ ఫీట్ అందుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ త్రీ ఇయర్స్ 'హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్' ట్యాగ్ అందుకున్నాడు.

మరి, ఈ డిజైరబుల్ మ్యాన్ లవ్‌లో పడ్డాడా? లేదంటే సింగిల్‌గా ఉన్నాడా? తెలుసుకోవాలని హైదరాబాద్ టైమ్స్ ట్రై చేస్తే విజయ్ దేవరకొండ స్ట్రయిట్‌గా ఆన్సర్ ఇవ్వలేదు. ప్రశ్నకు సమాధానం దాటేశాడు.

ఇదీ చదవండి: బజ్: అల్లు అర్జున్ 'పుష్ప' కోసం తరుణ్ ?

విజయ్ దేవరకొండకు యూరప్‌లో గర్ల్ ఫ్రెండ్ ఉందని ఇంటర్నెట్‌లో ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయ్. ఆమె కోసమే అప్పుడప్పుడూ రౌడీ బాయ్ యూరప్ ట్రిప్స్ వేస్తాడని టాక్. అమ్మాయి తల్లితో విజయ్ దేవరకొండ తల్లితండ్రులు మీట్ అయ్యినట్టు కూడా ఫొటోలు ఉన్నాయి.

ఆడియన్స్, ఫ్యాన్స్ మీ రిలేషన్షిప్ స్టేటస్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారని విజయ్ దేవరకొండను అడిగితే ఎవరు తెలుసుకోవాలని అనుకోవడం లేదని చెప్పాడు. లాస్ట్ ఇయర్ యూరప్‌లో కాఫీ షాప్‌లో మీతో ఎవరున్నారని ప్రశ్నిస్తే నలభై మంది దాకా ఉన్నారని తెలివిగా తప్పించుకున్నాడు. అంతే గానీ యూరప్‌లో ఎవరితో ఉన్నదీ విజయ్ దేవరకొండ చెప్పలేదు.