'డియ‌ర్ కామ్రేడ్' ట్రైల‌ర్ డేట్ ఎప్పుడంటే?

  • IndiaGlitz, [Tuesday,July 09 2019]

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం సెన్సేష‌న‌ల్ హీరో అనే క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 'పెళ్ళిచూపులు'తో హీరోగా తొలి స‌క్సెస్ సాధించిన ఈ యువ హీరో, త‌దుప‌రి చిత్రం 'అర్జున్ రెడ్డి 'తో స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగాడు.అలాగే నెక్ట్స్ మూవీ 'గీత గోవిందం'తో రూ.100 క్ల‌బ్‌లో చేరాడు. అదే ఊపులో ఆన్ లైన్‌లో లీకైనప్ప‌టికీ 'టాక్సీవాలా'తో మంచి విజ‌యాన్ని ద‌క్కించుకున్నాడు. ఇప్పుడు అంద‌రి కళ్లు విజ‌య్ న‌టిస్తున్న తాజా చిత్రం 'డియ‌ర్ కామ్రేడ్‌'పైనే ఉంది.

ఈ సినిమా ట్రైల‌ర్‌ను జూలై 11న 11గంట‌ల 11 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. అలాగే సినిమా జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కేవ‌లం తెలుగులోనే కాకుండా త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ సినిమా విడుద‌ల‌వుతుంది. కాబ‌ట్టి విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాపై భారీ ఆశ‌ల‌నే పెట్టుకున్నాడు. ట్రేడ్ వ‌ర్గాలు కూడా ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది.

More News

చెన్నై హైకోర్టులో విశాల్‌కు చుక్కెదురు

త‌మిళ హీరో, నిర్మాత విశాల్‌కు మ‌ద్రాస్ హై కోర్టులో చుక్కెదురైంది. వివ‌రాల్లోకెళ్తే.. విశాల్ న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు.

దర్పణం చిత్రం నుండి ఎదురయే  సాంగ్ ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

త‌నిష్క్‌రెడ్డి, ఎల‌క్సియ‌స్‌ హీరోహీరోయిన్లుగా రామకృష్ణ వెంప ద‌ర్శ‌క‌త్వం లో శ్రీ‌నంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిర‌ణ్ వెల్లంకి నిర్మిస్తున్న చిత్రం 'ద‌ర్ప‌ణం'..

ర‌వితేజ మూడో హీరోయిన్ దొరికేసింది

`అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` సినిమా త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `డిస్కోరాజా`.

పోలీసులు, మీడియాతో ఆటలా సందీప్, ప్రియదర్శి!

టాలీవుడ్ కమెడియన్‌ కమ్ హీరోగా రాణిస్తున్న ప్రియదర్శి బుల్లెట్‌ వాహనం మిస్సయ్యిందన్న వ్యవహారం ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో

బంగారం బిజినెస్‌లోకి కాజ‌ల్‌

హీరోయిన్స్ అంద‌రూ వారి సంపాద‌న‌ను వారికి న‌చ్చిన వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చే్స్తుంటారు. కొంద‌రు హీరోయిన్స్ నిర్మాణ సంస్థ‌లు స్థాపించి, ఇక్క‌డే సినిమాలు తీస్తుంటారు.