విజయ్ దేవరకొండ బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు
Send us your feedback to audioarticles@vaarta.com
‘అర్జున్ రెడ్డి’ విజయంతో యూత్ స్టార్‌గా ఎదిగారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ యంగ్ హీరో. అయితే.. విజయ్ కెరీర్‌ను ఒక్కసారి గమనిస్తే.. అతనికి మంచి పేరు తీసుకువచ్చిన సినిమాలన్నీ కొత్త దర్శకులు డైరెక్ట్ చేసినవే కావడం విశేషం. విజయ్ కీలక పాత్ర పోషించిన ‘ఎవడే సుబ్రమణ్యం’తో నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో రిషి పాత్ర.. విజయ్‌కు మంచి గుర్తింపునిచ్చింది.
అలాగే.. విజయ్ హీరోగా నటించిన ‘పెళ్లిచూపులు’ సినిమాతో తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా సోలో హీరోగా విజయ్‌కు మంచి పేరు, విజయం తీసుకువచ్చింది. ఇక గత ఏడాది డెబ్యూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం విజయ్ స్థాయిని మరో మెట్టుకి తీసుకుని వెళ్ళింది. ఇక విడుదలకు సిద్ధంగా ఉన్న ‘టాక్సీవాలా’కి కొత్త దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. మరి విజయ్‌కు మంచి పేరును తెచ్చిన కొత్త దర్శకుల జాబితాలోకి రాహుల్ కూడా చేరుతారేమో చూడాలి. అలాగే.. జూన్ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్న మరో చిత్రానికి కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఏదేమైనా కొత్త దర్శకులు విజయ్‌కు కలిసొస్తున్నారనే చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉంటే.. కొత్త దర్శకులతో పాటు.. అనుభవం ఉన్న డైరెక్టర్స్‌తో కూడా వరుస చిత్రాలు చేస్తున్నారు విజయ్. వాటిలో పరశురామ్ డైరెక్షన్‌లో నటించిన ‘గీత గోవిందం’ నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. మరోవైపు.. తొలిసారిగా బైలింగ్వల్ (తెలుగు, తమిళ్)మూవీ ‘నోటా’లో నటిస్తున్నారు. దీనికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు నందినీ రెడ్డి డైరెక్షన్‌లో కూడా ఓ మూవీలో నటించనున్నారు. ఇలా.. కొత్త దర్శకులతో పాటు.. అనుభవం ఉన్న డైరెక్టర్లతో కూడా సినిమాలు చేస్తూ.. కెరీర్‌ను చక్కగా మలుచుకుంటున్నారు విజయ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com