'నోటా' వెనుక అసలు కథ చెప్పిన విజయ్
Send us your feedback to audioarticles@vaarta.com
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ్ ఎంత పెద్ద స్టార్ అయిపోయారో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత తెలుగులోనే కాదు, తమిళంలో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. కాని తమిళ భాషపై పట్టు సాధించే వరకు కోలీవుడ్ వైపు చూడకూడదని అనుకున్నారట విజయ్. మరి అలాంటి నిర్ణయం తీసుకున్న ఈ యూత్ స్టార్.. కోలీవుడ్లో ‘నోటా’ సినిమాలో నటించడానికి ఎలా ఒప్పుకున్నారు? తెలుసుకోవాలంటే..ఆ వివరాల్లోకి వెళ్ళాల్సిందే.
“‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా, దర్శకుడు ఆనంద్ శంకర్ నా దగ్గరకు వచ్చారు. 'ఆనంద్ రాసిన కథ ఒకటి ఉంది. విందామా' అని అడిగారు జ్ఞానవేల్ రాజా. నాకైతే.. తమిళంలో నటించాలని లేదు, పైగా షూటింగ్ చేసి అలసిపోయి ఉన్నాను. అయినా.. ఆయన కోసం విన్నా. కాని బాగా అలిసిపోవడం వలన సరిగా వినలేకపోయాను. రెండోసారి మళ్ళీ చెప్పమన్నాను. దానికి ఆనంద్ సరే అన్నారు. ఒక వారం తర్వాత మళ్ళీ కలిసినప్పుడు కథను చెప్పారు. కథ విన్న వెంటనే చేయాలనిపించి ఓకే చెప్పేశాను” అని చెప్పుకొచ్చారు విజయ్. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమాని తమిళంతో పాటు.. తెలుగులో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com