'నోటా' వెనుక అస‌లు క‌థ చెప్పిన విజ‌య్‌

  • IndiaGlitz, [Saturday,April 21 2018]

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ్ ఎంత పెద్ద స్టార్ అయిపోయారో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత తెలుగులోనే కాదు, తమిళంలో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. కాని తమిళ భాషపై పట్టు సాధించే వరకు కోలీవుడ్ వైపు చూడకూడదని అనుకున్నారట విజయ్. మరి అలాంటి నిర్ణయం తీసుకున్న ఈ యూత్ స్టార్.. కోలీవుడ్‌లో ‘నోటా’ సినిమాలో నటించడానికి ఎలా ఒప్పుకున్నారు? తెలుసుకోవాలంటే..ఆ వివరాల్లోకి వెళ్ళాల్సిందే. 

“‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా, దర్శకుడు ఆనంద్ శంకర్ నా దగ్గరకు వచ్చారు. 'ఆనంద్ రాసిన కథ ఒకటి ఉంది. విందామా' అని అడిగారు జ్ఞానవేల్ రాజా. నాకైతే.. తమిళంలో నటించాలని లేదు, పైగా షూటింగ్ చేసి అలసిపోయి ఉన్నాను. అయినా.. ఆయన కోసం విన్నా. కాని బాగా అలిసిపోవ‌డం వ‌ల‌న స‌రిగా విన‌లేక‌పోయాను. రెండోసారి మళ్ళీ చెప్ప‌మ‌న్నాను. దానికి ఆనంద్ సరే అన్నారు. ఒక వారం తర్వాత మళ్ళీ కలిసినప్పుడు కథను చెప్పారు. కథ విన్న వెంటనే చేయాలనిపించి ఓకే చెప్పేశాను” అని చెప్పుకొచ్చారు విజయ్. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమాని తమిళంతో పాటు.. తెలుగులో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

నటుడిగా అన్ని పాత్రలు చేయాలని ఉంది - రానా

నటుడు అంటే.. అన్ని పాత్రలు చేయాలి. ఒకే పాత్రలో, ఒకే ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోవడం తనకు ఇష్టం లేదని అంటున్నారు దగ్గుబాటి రానా.

నాని మొద‌టి ప్ర‌య‌త్నం వ‌ర్క‌వుట్ కాలేదు

కలిసొచ్చే కాలంలో ఏ పని చేసినా విజయం తథ్యం అంటారు పెద్దలు.

విజువ‌ల్ వండ‌ర్ గా సాక్ష్యం

"అల్లుడు శీను, జ‌య జాన‌కి నాయ‌క" లాంటి మాస్ సినిమాల‌తో త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైన‌మిక్ బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా..

రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో చైతు?

యంగ్ హీరో నాగచైతన్య, కేరళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’ (ప్రచారంలో ఉన్న పేరు).

'యాత్ర' లో విజ‌య‌మ్మ‌గా ర‌మ్య‌కృష్ణ‌?

సమైక్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత డా.రాజశేఖర్ రెడ్డి జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.